Switch to English

పప్పు, బెల్లం జనాలకి.. పరమాన్నం ‘తన’వాళ్ళకి.!

ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ కంటెంట్‌ కార్పొరేషన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ అయ్యింది. ఒకప్పుడు తక్కువ మొత్తంలో సిబ్బంది ఎపిడిసికి వుంటే, ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్న ‘ఎపిడిసి’ కోసం అనూహ్యంగా 150 మంది సిబ్బంది అవసరం ఏర్పడురతోంది.

ఇటీవలే తనకు అత్యంత సన్నిహితుడైన చిన్న వాసుదేవరెడ్డికి ఎపిడిసి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, అందులో పెద్దయెత్తున నియామకాలకు అవకాశం కల్పించడం గమనార్హం. ఇదిప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇప్పటికే నామినేటెడ్‌ పోస్టులు, సలహాదారుల విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చూపుతున్న అత్యుత్సాహంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

ప్రభుత్వ ఖజానానికి అధికారికంగా ఇలా ‘కన్నం’ పెడుతున్నారనే విమర్శలు ప్రభుత్వం మీద విపక్షాల నుంచి దూసుకొస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఖజానాపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవాల్సిన జగన్‌ ప్రభుత్వం, ఈ తరహా వ్యవహారాల విషయంలో అస్సలేమాత్రం రాజీ పడ్డంలేదు.

సలహాదారుల విషయానికొస్తే, వారికి భారీ స్థాయిలో వేతనాలు చెల్లిస్తున్నారు. పెద్దయెత్తున సలహాదారులున్నా, ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయంటే, అవన్నీ ‘ఉత్సవ విగ్రహాలే’నన్నది విపక్షాల వాదన. ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌.. ఇది జగనన్న రాజ్యాంగం.. అన్నట్లు నడుస్తోంది వ్యవహారం.!

లేకపోతే, పాత ఎపిసిడిసిలో పనిచేసిన సిబ్బందిలో కొందరికి జీతాలు ఇవ్వకుండా, కొత్త నియమకాలు చేపట్టడమేంటి.? వారికి తమకు నచ్చిన స్థాయిలో వేతనాలు కల్పించడమేంటి.? అంటూ వివిధ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరి ఈ తాజా వివాదంపై జగన్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: కాటికెళ్లే వయసులో బాలికపై అత్యాచారం.!

బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి...

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

మహేష్ అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం ఎదురుచూసారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా పనులేం జరగలేదు కాబట్టి ఆర్ ఆర్...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...