Switch to English

హతవిధీ: అటు రాజకీయం.. ఇటు సోషల్ మీడియా పైత్యం

సంక్షోభాల నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెబుతుంటారు. ఇది నూటికి నూరు శాతం కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్ లో దీనిని రాజకీయాలకూ అన్వయంచడమే దురదృష్టకరం. కరోనా వంటి విపత్కర సమయంలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలూ చోటుచేసుకున్నాయి. తాజాగా విశాఖ విషవాయువు సందర్భంగానూ ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి పీడకలను గుర్తుకుతెచ్చేలా జరిగిన ఈ సంఘటన విశాఖ ప్రజల్లోనే కాకుండా అందరినీ భయాందోళనలకు గురిచేస్తుండగా.. పార్టీలు మాత్రం రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా శోచనీయం. ఓ వైపు విశాఖలో పరిస్థితులు ఘోరంగా ఉండగా.. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార పార్టీ ఆరోపణలు ప్రారంభించారు.

విశాఖకు రాజధాని తరలింపు ఇష్టం లేకపోవడం వల్ల, ఆ ప్రాంతం సురక్షితం కాదని నిరూపించేందుకు ఇలాంటి కుట్రకు తెగబడి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఆరోపణలు ఎంతమాత్రం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రాజకీయాలు ఇలా సాగుతుండగా.. సోషల్ మీడియాలో పైత్యం మరీ ఎక్కువైపోయింది. అధికార, విపక్షాలకు చెందిన సోషల్ మీడియా సైన్యం ఒకరిపై మరొకరు దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా అంటేనే అనుచిత పోస్టులు, మార్ఫ్ డ్ ఫొటోలు ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.

తాజాగా విశాఖ విషవాయువు ఘటనను కూడా ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టడానికి వినియోగిస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉండకుండా కుట్ర పన్నిన వైజాగ్ వాసులకు ఇలాగే కావాలంటూ కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి.

అయితే, అదంతా కుట్ర అని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ స్పష్టంచేశారు. అది మార్ఫ్ డ్ పోస్టని పేర్కొన్నారు. ఆ ట్విట్టర్ అకౌంట్ నేమ్ లో 15 అక్షరాలకు మించి ఉండటమే ఇందుకు నిదర్శనమని.. ట్విట్టర్ అకౌంట్ యూజర్ నేమ్ 15 అక్షరాలకు మించి ఉండదనే విషయం కూడా ఆ పేటీఎం బ్యాచ్ కు తెలియదని ఎద్దేశా చేశారు.

మొత్తానికి విషాద సమయంలోనూ అటు రాజకీయంగానూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం మంచిది కాదని పలువురు పేర్కొంటున్నారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కరోనా టైంలో సైలెంట్ గా వ్యభిచారం చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా??

ప్రస్తుతం దేశం లాక్ డౌన్ లో ఉంది. కరోనా భయంతో వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలు భయపడుతూనే ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరినీ తాకకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దగ్గు,...

ఇండియాలో మొదటగా అక్కడ గుడి గంట మ్రోగబోతుంది

కరోనా విపత్తు నేపథ్యంలో ఇండియాలో గత రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు పూర్తిగా మూత పడి ఉన్నాయి. కరోనా భయంతో చర్చ్‌లు, మసీద్‌లతో పాటు దేవాలయాలు పూర్తిగా క్లోజ్‌ చేశారు. సామాజిక దూరం...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని...

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ట్రంప్‌ అత్యుత్సాహం.. నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా మరి.?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. ఎంత గొప్ప సన్నిహితుడంటే, ‘మాకు గనుక హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను భారతదేశం ఇవ్వకపోతే, మా తడాఖా ఏంటో భారతదేశానికి...