Switch to English

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’తో హీరోగా రావు రమేష్…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,470FansLike
57,764FollowersFollow

తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రావు రమేష్ కథానాయకుడిగా, టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రధారులు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ప్రేక్షకులే ముఖ్య అతిథులుగా వినూత్నంగా ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రావు రమేష్ ఫస్ట్ లుక్ చూస్తే… గళ్ళ చొక్కా, లుంగీలో పక్కా మాసీగా కనిపిస్తున్నారు. ఈసారి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తానని రావు రమేష్ తెలిపారు.

సాధారణంగా సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించడం కామన్. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ టీమ్ కొత్తగా ఆలోచించింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయమని ప్రేక్షకుల్ని కోరింది. సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా క్యూఆర్ స్కానింగ్ ద్వారా లుక్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఫస్ట్ టైమ్ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ టీమ్ చేసిన కొత్త ప్రయత్నానికి సూపర్బ్ రెస్పాన్స్ లభించింది.

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… ”ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌టైన్ చేస్తారు. వినోదంతో పాటు భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్ గారి లుక్ చాలా బావుందని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేయమని మేం చేసిన విజ్ఞప్తికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. 50 వేల మందికి పైగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారు. రావు రమేష్ గారి ప్రేక్షకులు చూపిస్తున్న ఈ అభిమానం మాకెంతో సంతోషం కలిగిస్తోంది. కుటుంబం అంతా కలిసి చూసేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఉంటుంది” అని చెప్పారు.

రావు రమేష్ మాట్లాడుతూ… ”సినిమా చాలా బాగుంటుంది. భలే గమ్మత్తుగా ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చూపించిన అభిమానానికి సదా కృతజ్ఞుడిని” అని చెప్పారు.

సినిమా

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

Kota Srinivasa Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కోట...

Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుఝామున ఫిల్మ్ నగర్ ఆయన నివాసంలో కన్నుమూశారు....

రష్మిక కొత్త సినిమా నుంచి ‘నదివే…’ పాట

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్,...

రాజకీయం

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

హిందీ నేర్చుకోవడంలో తప్పేంటి? – పవన్ కళ్యాణ్

హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రాజ భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందీ భాషపై తన అభిప్రాయాలను సరళమైన శైలిలో...

ఎక్కువ చదివినవి

జన నాయకుడు: బ్యాటరీ సైకిల్‌ను స్వయంగా నడిపిన పవన్

విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్‌ను తయారు చేశాడు. ఈ సైకిల్ ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే మూడు గంటల్లో...

ఓ భామ అయ్యో రామ’ బ్లాక్‌బస్టర్ కావాలి: మంచు మనోజ్

సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మలయాళ చిత్రం ‘జో’తో గుర్తింపు పొందిన మాళవిక మనోజ్...

‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ రిలీజ్

టాప్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ విభిన్న చిత్రాలు తీస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మరోసారి కొత్త కంటెంట్‌తో వస్తోంది. ఈ సంస్థ నుంచి రాబోతున్న తాజా చిత్రం...

Daily Horoscope: నేటి రాశిఫలాలు

జూలై 14, 2025 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): పనులన్నీ చకచకా పూర్తయ్యే రోజు. అనుకున్నదానికంటే వేగంగా కొన్ని విషయాలు కుదురుతాయి. ఆఫీసులో మీ అభిప్రాయానికి ప్రాధాన్యం లభిస్తుంది. కుటుంబంలో మంచి అనురాగ వాతావరణం...

దేవాడ మైనింగ్ లో అక్రమ తవ్వకాలపై పవన్ కల్యాణ్ స్పందన

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని దేవాడ మైనింగ్ బ్లాక్‌లో అనుమతించిన పరిమితికి మించి మాంగనీస్ తవ్వకాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. ఏడాదికి 10 లక్షల టన్నుల...