Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీస్ రవి, నవీన్.. దర్శకులు బాబి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం చిరంజీవి, రామ్ చరణ్ పాటలతో పలువురు గాయకులు, డ్యాన్సర్స్ అలరించారు. పలు రంగాల్లో ప్రతిభను చాటుకున్న వారిని సన్మానించారు.
హీరో నిఖిల్ (Nikhil) మాట్లాడుతూ.. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనుకునే వ్యక్తి రామ్ చరణ్. నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆయన సినిమాలలో ఆరెంజ్ లైఫ్ లాంగ్ కల్ట్ క్లాసిక్. ఇప్పటికీ ఫ్రెష్ గా ఉండే సినిమా. యంగ్ హీరోలు ఎదగాలని కోరుకునే ఉన్నత వ్యక్తిత్వం ఆయనది. నా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ మంచి కాన్సప్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
కిరణ్ అబ్బవరం.. రామ్ చరణ్ కు బర్త్ డే విషెష్. 2007లో చిరుతతో ఎంతోమందికి సమాధానం ఇచ్చారు. రంగస్థలంతో మరెవరినీ మాట్లాడకుండా చేశారు. నాలాంటోళ్లకి ఇన్ స్పిరేషన్.