రెండేళ్లుగా ఆగిపోయిన కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ చిత్రం ఇండియన్ 2 ఎట్టకేలకు తిరిగి షూటింగ్ ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకున్న ఎన్నో కష్టాలను అధిగమించి రీసెంట్ గానే ఫ్రెష్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈ మేరకు అధికారిక అప్డేట్ ను కూడా ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఈ షెడ్యూల్ లో రకుల్ ప్రీత్ సింగ్ కు జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విక్టరీ సింబల్ తో బూమేరాంగ్ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రకుల్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. రకుల్ తో పాటు సిద్ధార్థ్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు.
హీరోయిన్ గా నటిస్తోన్న కాజల్ అగర్వాల్, ఈ చిత్ర హీరో కమల్ హాసన్ సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొంటారు.
ఏఆర్ రహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ లెవెల్లో నిర్మిస్తోంది.
938729 734243I actually delighted to uncover this internet site on bing, just what I was looking for : D too saved to fav. 290921