తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న మహా నటుడు నందమూరి తారక రామారావు. సినిమా రంగమైనా, రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచి పోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెనాలి పట్టణం NVR కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి సారధ్యంలో కార్యక్రమం జరిగింది.
ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డు ను ప్రముఖ సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారికి నందమూరి తారక రత్న చేతుల మీదుగా అందించడం జరిగింది. 2022 మే 28 న మొదలైన ఈ శత జయంతి వేడుకలు 365 రోజుల పాటు 2023 మే 28 వరకు జరగనున్న విషయం విదితమే. 365 రోజులు… వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలుగా ఈ వేడుకల్లో జరుపుతున్నారు.
389102 312636Hello there! Very good post! Please inform us when I will see a follow up! 835084