Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతటి క్రియేటివ్ డైరక్టరో తెలిసిందే. తెలుగు సినిమాని మాత్రమే కాదు.. భారతీయ సినిమాను సైతం ప్రపంచ సినీపటంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ డైరక్టర్. కొత్త తరహాలో ఆలోచించి కథతో మ్యాజిక్ చేసి విజువల్ వండర్ క్రియేట్ చేయడం ఆయన సొంతం. అలాంటి రాజమౌళిలో దర్శకుడు మాత్రమే ఉన్నాడనుకుంటే పొరపాటే.
తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని ఇటివలే ప్రేక్షకులకు తెలుస్తోంది. ఇటివల తన ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్లో భార్య రమతో కలిసి ప్రేమికుడు సినిమాలోని ‘అందమైన ప్రేమ రాణి..’ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించారు. రాజమౌళిలో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ వీడియో వైరల్ అయింది.
ఇప్పుడు అదే పాటకు రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. భార్య రమతో కలిసి చక్కగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాహుబలిలో చిన్న కామియో చేసినట్టు ఈసారి డ్యాన్స్ కూడా చేయండని కామెంట్స్ చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ‘హీరోలా ఉన్నారు.. హీరోగా చేయొచ్చు కదా’ అనే ప్రశ్నకు.. గుర్రం చేసే పని గుర్రం చేయాలి.. గాడిద చేసే పని గాడిద చేయాలనే సామెత చెప్పి నవ్వేశారు.
Mr. Perfectionist @ssrajamouli 👌🙌🤩🤩 pic.twitter.com/fmi4rHDXiX
— Indian Clicks (@IndianClicks) April 11, 2024