Switch to English

Love Guru Review: ‘లవ్ గురు’ మూవీ రివ్యూ: సినిమా పర్లేదు గురూ.!

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow
Movie లవ్ గురు
Star Cast విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగి బాబు
Director వినాయక్ వైతినాథన్
Producer మీరా విజయ్ ఆంటోని
Music భరత్ ధనశేఖర్
Run Time 2గం 26ని
Release 11 ఏప్రిల్, 2024

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘రోమియో’ని తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో డబ్ చేశారు. ‘లవ్ గురు’ అని పేరు పెట్టి, ఫ్యామిలీ సినిమా.. అంటూ ఎలా ప్రమోట్ చేశారు.? సినిమా కథ కమామిషు ఏంటో తెలుసుకుందాం పదండిక.

కథ:

ముప్ఫయ్ అయిదేళ్ళ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అరవింద్ (విజయ్ ఆంటోనీ), ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఓ అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు, వెంటనే పెళ్ళయిపోతుంది. ఇక్కడే పెద్ద ట్విస్ట్, పెళ్ళిని అడ్డం పెట్టుకుని, ఇంట్లోంచి పారిపోవాలనుకుంటుంది అతన్ని పెళ్ళి చేసుకున్న లీల (మిర్నాలిని రవి). లీల ఎందుకలా చేసింది.? అరవింద్, లీల వైవాహిక బంధం ఏమయ్యింది.? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటులు..

అరవింద్ పాత్ర కోసం ఏమేం చేయాలో అన్నీ చేయడానికి సిన్సియర్‌గా ప్రయత్నించాడు విజయ్ ఆంటోనీ. డల్ లుక్.. పోష్ లుక్.. రెండిట్లోనూ, ఆ వ్యత్యాసాన్ని చూపించేందుకు ఎనర్జీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.

మిర్నాలిని రవి తన పాత్రకు న్యాయం చేసింది. ట్రెడిషనల్‌గానూ, ట్రెండీగానూ.. నేచురల్ లుక్‌తో కనిపించింది. యోగిబాబు ఇచ్చే ప్రేమ సలహాలు థియేటర్లలో నవ్వులు పూయించాయి. హీరో మావయ్య పాత్రలో వీటీవీ గణేష్ తన ట్రేడ్ మార్క్ కామెడీ పండించాడు. హీరో తల్లి పాత్రలో సుధ కనిపించింది.

సాంకేతిక నిపుణులు..

కథ కొత్తదేమీ కాదు. కథనం పరంగానూ మరీ ఎక్కువ ట్విస్టులేమీ పెట్టెయ్యకుండా కథని నేరుగానే చెప్పేశారు. ‘జనని’ ఎవరు అన్న ప్రశ్న చివరి వరకూ ప్రేక్షకుడ్ని కొంత అయోమయంలోకి నెట్టేస్తుంది. అది రివీల్ అవడం ఒకింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్ బాగానే వున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగానే సన్నివేశాలు, డైలాగులు అనిపిస్తాయ్. మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ బావుంది. కొంచెం ట్రిమ్మింగ్‌కి ఆస్కారం వుంది. టైటిల్ పరంగా యూత్‌ని టార్గెట్ చేసినట్లు అనిపిస్తుందిగానీ, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమానే. నిర్మాణపు విలువలు ఓకే.

ప్లస్ పాయింట్స్

  • సరదా సరదాగా సాగే కొన్ని సన్నివేశాలు
  • ప్రీ క్లయిమాక్స్‌లో చెల్లెలి సెంటిమెంట్

మైనస్ పాయింట్స్

  • అక్కడక్కడా సాగతీతగా అనిపించే సన్నివేశాలు

విశ్లేషణ: విజయ్ ఆంటోనీ అనగానే, ఆ సినిమా ఇలా వుండొచ్చు.. అన్న ఐడియాతోనే ప్రేక్షకుడు థియేటర్లోకి అడుగు పెడతాడు. అలా చూస్తే, ఈ సినిమాలో అద్భుతాలేం కనిపించవు. అలాగని, సినిమా నిరాశపరచదు కూడా. కాసిని నవ్వులున్నాయ్.. ఎమోషనల్ సీన్స్ వున్నాయ్.. కాస్త రొమాంటిక్ టచ్ కూడా వుంటుంది. సిస్టర్ సెంటిమెంట్, భార్యా భర్తల మధ్య సన్నివేశాలకి ఆడియన్స్ కనెక్ట్ అయితే, సినిమాకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం వుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

765 COMMENTS

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

ప్రజల ఆస్తి వైఎస్సార్.! కానీ, వైఎస్సార్ ఆస్తులు ప్రజలవి కావు.! అంతేనా.?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 మార్చి 2025

పంచాంగం తేదీ 21-03-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ సప్తమి రా. 11.50 వరకు నక్షత్రం:...

యూఎస్ లోని ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్.. అత్త, కోడలు, కొడుకు మృతి..

అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్ జరగ్గా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల పల్లికి చెందిన మాజీ...

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం

టాలీవుడ్ లో చాలా అసోసియేషన్లు ఉన్నాయి. అందులో తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ కూడా ఉంది. తాజాగా ఈ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్...