Switch to English

భయంతో పరిగెత్తా: యాక్సిడెంట్‌పై రాజ్‌ తరుణ్‌ వెర్షన్‌ ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

హైద్రాబాద్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎట్టకేలకు యువ హీరో రాజ్‌ తరుణ్‌ స్పందించాడు. రాజ్‌ తరుణ్‌ని అరెస్ట్‌ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ యువ హీరో సోషల్‌ మీడియా వేదికగా జరిగిన ఘటనపై వివరణ ఇచ్చాడు. యాక్సిడెంట్‌ తన వల్లే జరిగిందని రాజ్‌ తరుణ్‌ ఆ వివరణలో స్పష్టం చేశాడు. ప్రతి రోజూ ఇంటి నుంచి అదే మార్గంలో తాను వెళుతుంటాననీ, అది యాక్సిడెంట్స్‌ జరిగే ప్రాంతమనీ, షడెన్‌గా టర్న్‌ తీసుకోవాల్సి రావడంతో కారు అదుపు తప్పిందనీ, కారుని కంట్రోల్‌ చేయలేకపోయాననీ, యాక్సిడెంట్‌ చోటు చేసుకుందనీ, పెద్ద శబ్దం రావడంతో చెవులు కాస్సేపు పనిచేయలేదనీ, కళ్ళు సైతం మసకబారాయనీ, ఆ భయాందోళనతో సాయం కోసం తాను పక్కనే వున్న తన ఇంటికి పరిగెత్తాననీ రాజ్‌ తరుణ్‌ ఆ ఘటనను వివరించాడు.

ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటున్నాననీ, త్వరలో షూటింగ్‌కి తిరిగి హాజరవుతాననీ రాజ్‌ తరుణ్‌ స్పష్టం చేశాడు. సీట్‌ బెల్ట్‌ ధరించడం వల్లే తాను క్షేమంగా ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్‌ తరుణ్‌ చెప్పాడు. రాజ్‌ తరుణ్‌ వివరణతో, ‘పరారీ’ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లే. మరోపక్క, కారు యజమానికి పోలీసులు నోటీసులు పంపారు. ‘ఘటనపై ప్రత్యక్ష సాక్షుల నుంచి కొన్ని వివరాలు సేకరించాం. ప్రమాద సమయంలో కారులో ఎవరున్నారు.? ఎవరు నడుపుతున్నారు.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు.

కారు ఓనర్‌ ఇచ్చే వివరణను బట్టి, ఆ కారుని ఎవరు డ్రైవ్‌ చేశారన్నదానిపై ఓ నిర్ణయానికి రావడానికి వీలవుతుంది..’ అంటూ కేసు విచారణ చేపట్టిన పోలీసులు వెల్లడించారు. మరోపక్క, రాజ్‌ తరుణ్‌కి సోషల్‌ మీడియాలో అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. ‘ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమైనది. చాలాసార్లు మేం కూడా అక్కడ ప్రమాదాల్ని చూశాం, ప్రమాదాల్లో చిక్కుకున్నాం..’ అని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదిలా వుంటే, తొలుత ఈ ఘటనకు సంబంధించి మరో హీరో తరుణ్‌ పేరు తెరపైకి రావడం, తరుణ్‌ ఆ వార్తల్ని ఖండించడం తెలిసిన విషయాలే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...