బిగ్‌బాస్ హౌస్ నుంచి పునర్నవి భూపాలం అర్థాంతరంగా ఎలిమినేట్ అయిపోతుందా.? మహేష్ విట్టాకి బిగ్‌బాస్ గతంలో ఇచ్చిన ఇన్విటేషన్‌ని నాగార్జున చించేయబోతున్నాడా.? ఇలా శనివారం సాయంత్రం వరకూ చాలా అనుమానాలు బిగ్‌బాస్ వ్యూయర్స్‌లో కన్పించాయి. బిగ్‌బాస్‌ని బండ బూతులు తిట్టేసింది మరి పునర్నవి. మహేష్ తక్కువేమీ తిన్లేదు, చెడా మడా వాయించేశాడు బిగ్‌బాస్‌కి.. తన మాటలతో. ఇంకేముంది, నాగార్జున సీరియస్ అయ్యాడు.. పునర్నవి, మహేష్‌తోపాటు శ్రీముఖికి కూడా షాకిచ్చాడంటూ ప్రోమోస్ బయటకొచ్చాయి.
తీరా, షో స్టార్ట్ అయ్యాక ఆ ఓవరాక్షన్ ఎంతో సేపు కన్పించలేదు. స్టేజ్ మీద నాగార్జున ఓ షూకి పాలిష్ చేశాడు. పునర్నవీ ఇలాగా మాట్లాడేది.? అన్నాడు. శ్రీముఖిని ఉద్దేశించి మాత్రం, హౌస్‌కి నువ్వు బిగ్‌బాస్ కాదు.. అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అంతే, ఆ తర్వాత వ్యవహారమంతా మామూలే. పీవీ సింధు, గోపీచంద్ సర్‌ప్రైజ్ గెస్ట్‌లుగా కన్పించారు. మెరుపులా వచ్చారు, అలాగే వెళ్ళిపోయారు. ‘అప్లికేషన్ పెట్టుకుని రాలేదు.. ఇన్విటేషన్ మీద వచ్చాను..’ అని మహేష్ చెప్పిందే నిజమయ్యింది. ఆ ఇన్విటేషన్‌ని చింపేసేందుకు నాగార్జున సాహసం చేయలేదు. ‘చింపేస్తున్నా..’ అంటూ గేట్స్ తెరిపించాడుగానీ, మహేష్‌ని బయటకు పంపించలేకపోయాడు నాగార్జున.
Also Read: బిగ్ షాక్: శ్రీముఖి నోటికి తాళమేసిన వరుణ్ సందేశ్
పునర్నవికి నాగార్జున క్లాస్ పీకిన మాట వాస్తవం. అంతలోనే, ఆమె అలా హర్ట్ అవడానికి కారణం టాస్క్‌ని అర్థం చేసుకోలేని హౌస్‌మేట్స్ అని తేల్చేసి, పునర్నవికి మరింత బలాన్నిచ్చాడు. అంటే, బిగ్‌బాస్‌ని పునర్నవి తిట్టడం కరెక్టేనని నాగార్జున సర్టిఫికెట్ ఇచ్చినట్లయ్యింది. ఎప్పుడూ శ్రీముఖిని వెనకేసుకొచ్చే నాగార్జున, ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న తీరు చూసి తనను తాను మార్చుకున్నాడేమో.. ఈసారి వెరైటీగా రాహుల్ సిప్లిగంజ్‌ని వెనకేసుకొచ్చాడు.
టాస్క్ సందర్భంగా శ్రీముఖి, మిగతా కంటెస్టెంట్స్ మీద ప్రదర్శిస్తున్న బాసిజంని ఖండించాడు. ఇక్కడే శ్రీముఖి బాగా హర్టయ్యింది. ఎంతలా హర్టయ్యిందంటే, చివర్లో వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పింది కూడా. ఇక్కడితో బిగ్‌హౌస్‌లో శ్రీముఖి ఎనర్జీ కంప్లీట్‌గా జీరో అయిపోయినట్లే. మొత్తమ్మీద, చాలా ఎక్స్‌పెక్ట్ చేసిన బిగ్‌బాస్ అభిమానులకి, శనివారం ఎపిసోడ్ నిరాశ కలిగించింది. ఆదివారం ఎపిసోడ్‌లో శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయిపోనుంది. అది ముందే లీకు రూపంలో బయటకొచ్చేసింది కూడా. ఈ రోజు మొత్తం ఫన్ డే.. అంటూ హౌస్‌లో హడావిడిని చూపిస్తూ ఓ ప్రోమో విడుదల చేశారుగానీ, బిగ్‌బాస్ షోకి నిన్నటి ఎపిసోడ్ చేసిన డ్యామేజీ మాత్రం అంతా ఇంతా కాదు.!
