“సిరులొలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు.. చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు..” అంటూ అమ్మ.. లాలి పాడుతూ పాపాయికి పాలు తాగించడం చూశాం మనం..
కానీ అయ్య బాబోయ్ ఈ యువ జంట ఏమిటి.. పులి పిల్లకి పాలు తాగిస్తూ దర్జాగా ఫోజు ఇచ్చారు.. ఒకవేళ బొమ్మ పులి అయి ఉంటుందా..
ఇంకో పక్క ఆ పులి పిల్ల తల్లితో కూడా ముచ్చటగా ఫోటో దిగారు.. ఇది కూడా బొమ్మ పులే అనుకుంటున్నారా.. ఎంత మాత్రం కాదండోయ్. ఇవి నిజ్జం గా నిజం పులులే.
ఆశ్చర్య పోకండిలే.. మీరు గనుక థాయిలాండ్ టూర్ కు వెళ్తే, ఎంచక్కా పులులతో ఫోటో దిగవచ్చు.
“పులిని చూడాలనిపించిందనుకో తప్పులేదు .. దూరం నుంచి చూస్కో.. , పులితో ఫోటో దిగాలి అనిపిస్తే …కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ..ట్రై చేయొచ్చు.. కానీ చనువు ఇచ్చింది కదాని పులితో ఆడుకోవాలని అనుకుంటే మాత్రం” అనే తెలుగు సినిమా డైలాగును మీరు ఇక్కడ పక్కన పెట్టేయొచ్చు.. ఎంచక్కా పులితో ఫోటోలు దిగవచ్చు, కాసేపు ఆడుకోనూ వచ్చు..
బ్యాంకాక్ నుంచి పట్టాయకు వెళితే పట్టాయ శివారులో ‘శ్రీ రాచ టైగర్ జూ” ఉంది. అక్కడకు వెళితే మీరు కూడా ఇలా ఎంజాయ్ చేసి రావచ్చు.
అక్కడ పులులకు చిన్నప్పటి నుంచి వాటి యజమానులు ఆ రకమైన తర్ఫీదును ఇవ్వడం వల్ల అవి క్రూరత్వాన్ని మర్చిపోయి సాధు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదీ విషయం .
అంతే కాదండోయ్.. ఇదే జూ లో టైగర్ షో నే కాకుండా ఇంకా ఎలిఫెంట్ షో, క్రోకోడయిల్ షో, పిగ్ షో లు ఉన్నాయిట..

