ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చాలా టెన్షన్ లో ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఆశించిన ఫలితాలు అందించకపోవడం ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో తన తదుపరి సినిమాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు బాలయ్య. తాజగా బాలయ్యతో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను. అయితే ఈ సినిమాకంటే ముందే బాలయ్య వేరే సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే బాలయ్యతో సినిమా చేసేందుకు మరో మాస్ దర్శకుడు వివి వినాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కించాలని అటు నిర్మాత కళ్యాణ్ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే వినాయక్ – బాలయ్య మధ్య కథ చర్చలు జరిగి కథ విషయంలో తేడాలు వచ్చాయని, మంచి కథ ఉంటె తీసుకురా అని బాలయ్య చెప్పినట్టు టాక్. దాంతో పాటు ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన ఎఫ్ 2 తో సంచలన విజయం అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఉంటుందని అంటున్నారు.
నిజానికి ఆ మధ్యే అనిల్ తో బాలయ్య చర్చలు కూడా జరిపాడని, రామారావు గారు టైటిల్ తో ఓ సినిమాకు అనిల్ ప్లాన్ చేసినట్టు చెప్పేసాడు. ఐతే ఆ కథ బాలయ్యకు నచ్చకపోవడంతో మరో కథ అడిగాడట. ఆ తరువాత అనిల్, రవితేజతో రాజా ది గ్రేట్ తీసాడు. మరోసారి బాలయ్యతో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం మహేష్ తో సినిమాకోసం సిద్దమవుతున్న అనిల్ రావిపూడిని, బాలయ్య సినిమా గురించి అడిగితే, ఆ సినిమా చేయాల్సింది కానీ కుదరలేదని క్లారిటీ ఇచ్చాడు. సో అనిల్ రావిపూడితో, బాలయ్య సినిమా లేనట్టే అని క్లారిటీ వచ్చేసింది. సో బాలయ్యకు ప్రస్తుతం వేరే సినిమాల కమిట్మెంట్ లేదు కాబట్టి నెక్స్ట్ బోయపాటి సినిమానే.
