బాలీవుడ్ సినిమాలో మన తెలుగు కమెడియన్ నటించనున్నాడు. అదికూడా ఏ చిన్న హీరో సినిమాలో కాదు, ఏకంగా బాలీవూడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో? ఏంటి షాక్ అవుతున్నారా !! ఇంతకీ ఎవరా కమెడియన్ ..ఏమా కథ అంటే. ప్రస్తుతం తెలుగులో స్టార్ కమెడియన్ ఎవరంటే అందరు చెప్పే సమాధానం ఒక్కటే అది బ్రహ్మానందం. ఆ తరువాత ఆ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఆలీ. ఇప్పుడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది ఆలీనే. ఆ వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో దబాంగ్ సిరీస్ అంటే ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరికి తెలుసు. ఆ సినిమాకు రెండో సీక్వెల్ గా వచ్చిన దబాంగ్ 2 కూడా మంచి విజయం అందుకుంది.
ఇప్పుడు దబాంగ్ మూడో సిరీస్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా తెరకెక్కే ఈ సినిమాలో కమెడియన్ ఆలీ నటించనున్నాడు. ఇందులో ఆలీ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తాడట. దబాంగ్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సంచలనం విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాలో ఆలీ పాత్ర పవన్ కు ప్రధాన సహాయకుడిగా సాగుతూ కామెడీ పంచుతుంది. మరి ఈ సినిమా చూసాడేమో సల్మాన్, అందుకే తన దబాంగ్ 3 లో ఆలీకి అవకాశం కల్పించాడు.
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఈ షూటింగ్ లో పాల్గొన్న సల్మాన్ తో ఆలీ తన ఫ్యామిలీ తో కలిసి ఓ ఫొటోకూడా దిగాడు. అన్నట్టు దబాంగ్ 3 సినిమాలో కన్నడ నటుడు సుదీప్ విలన్ గా కనిపిస్తాడట. ఇప్పటికే ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ బాలీవుడ్ లో హిట్టుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు ప్రభుదేవా. మరి ఈ సినిమాతో ఆలీ కామెడియాన్ గా బాలీవుడ్ లో సెటిల్ అవుతాడేమో చూడాలి.
