ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ వ్రైట్ మొసళ్ల వేటగాడిగా మంచి గుర్తింపు ఉంది. అతడు సోషల్ మీడియాలో తన మొసళ్ల వేటకు సంబంధించిన వీడియోలను మరియు ఫొటోలను షేర్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అతడు ఇతర విషయాల గురించి కూడా రెగ్యులర్ గా షేర్ చేయడం జరుగుతుంది. పాపులర్ అవ్వడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మ్యాట్ కూడా ఒక వీడియోను పాపులర్ అవ్వడానికి పెట్టి విమర్శల పాలయ్యాడు.
ఒక చిన్న కుర్రాడు పాపు తోక పట్టుకుని లాగుతున్న వీడియోను షేర్ చేశాడు. పాములను పట్టుకోవడానికి ట్రైనింగ్ అంటూ ఆ వీడియోకు కామెంట్ పెట్టాడు. మరీ ఇలా చిల్లరగా వ్యవహరించావు ఏంటీ మ్యాట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వ్యూస్ మరియు ఫాలోవర్స్ కోసం ఇంతలా దిగజారాలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఈ విషయమై కొందరు మ్యాట్ ను సమర్థిస్తుంటే కొందరు మాత్రం తిట్టి పోస్తున్నారు.