ప్రేమను వ్యక్తం చేసేందుకు మంచి ప్రదేశం కావాలి.. ఆ ప్రదేశంలో ప్రేమను వ్యక్తం చేస్తే భాగస్వామి జీవితంలో ఎప్పుడు కూడా మర్చి పోకూడదు. అలాంటి ప్రత్యేకమైన సందర్బం ను సీఎస్కే ఆటగాడు నిన్నటి మ్యాచ్ లో ఏర్పర్చుకున్నాడు. పంజాబ్ మరియు చెన్నై జట్ల మద్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో భాగంగా చెన్నై ఆటగాడు దీపక్ చహార్ అందరు చూస్తుండగా లైవ్ లో తన గర్ల్ ప్రెండ్ కు ప్రపోజ్ చేశాడు. సడన్ గా దీపక్ నుండి లవ్ ప్రపోజల్ రావడంతో షాక్ అయిన ఆ అమ్మాయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యింది.
చుట్టు ఉన్న జనాలు వారి ప్రేమకు అభినందనలు తెలిజేస్తూ చప్పట్లు కొట్టారు. సీఎస్కే ఆటగాడిగా మంచి పేరును దక్కించుకున్న దీపక్ ఈమద్య కాలంలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. అలాంటి ఒక స్టార్ క్రికెటర్ నుండి ప్రేమ ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఐపీఎల్ లైవ్ లో లవ్ ప్రపోజ్ చేసి అందరి దృష్టిని సీఎస్కే ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. తన ప్రియురాలికి ఎప్పటికి మర్చిపోలేని గిప్ట్ ను అందించాడు.