కరోనా వైరస్ అప్పుడప్పుడే ఇండియాలో చొరబడుతున్న రోజులవి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మీడియాలో చాలా యాక్టివ్‌గా కన్పించేవారు. కేంద్రాన్ని సమర్థించేవారు.. అదే సమయంలో, కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించేవారు కూడా. ప్రజల్లో భరోసా నింపేందుకు వీలు చిక్కినప్పుడల్లా మీడియా ముందుకొచ్చే కేసీఆర్‌ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ‘తెలంగాణే కాదు, దేశాన్ని కూడా నడిపే శక్తి ఈయనకి వుంది..’ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఉప్పొంగిపోయాయి అప్పట్లో.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. ‘కేసీఆర్ ఎక్కడ.?’ అని ప్రశ్నిస్తున్నారంతా. ఏకంగా హైకోర్టులో ఈ మేరకు కేసు కూడా నమోదయ్యింది.నవీన అలియాస్ తీన్మార్ మల్లన్న, కేసీఆర్ ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్ విషయంలో ఇంత సాహసం ‘మల్లన్న’ ఎలా చేయగలిగాడు.?
అసలు విషయమేంటంటే, రెండు మూడు రోజుల క్రితం, ‘కేసీఆర్‌కి కరోనా పాజిటివ్..’ అంటూ ఓ గాసిప్ గుప్పుమంది. ఈ గాసిప్ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. మరోపక్క, ప్రగతి భవన్ సిబ్బందిలోనూ కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలిందంటూ వార్తలు రావడం, గత కొద్ది రోజులుగా కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడం… వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, ‘మల్లన్న’ హైకోర్టును ఆశ్రయించాడన్నమాట కేసీఆర్ ఆచూకీ కోసం.
తెలంగాణలో గత కొద్ది రోజులుగా అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సచివాలయానికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, యుద్ధ ప్రాతిపదికన పాత సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కొత్త సచివాలయానికి సంబంధించి డిజైన్ కూడా దాదాపు ఖరారైపోయింది. దానర్థం కేసీఆర్, ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నట్లే కదా.? మరెందుకు కేసీఆర్ మీడియా ముందుకు రావడంలేదు.? అన్న ప్రశ్న రావడం సహజమే.
అయితే, తెలంగాణలో కరోనా తీవ్రత చాలా దారుణంగా వుంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే కరోనా తగ్గడం సంగతెలా వున్నా, పేషెంట్లు.. వారి కుటుంబ సభ్యులు దోపిడీకి గురవుతున్నారు. ఇంకోపక్క, కరోనా టెస్టుల కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోంది సాధారణ ప్రజానీకం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇదంతా ప్రభుత్వ వైఫల్యమేనన్న భావన గట్టిగా బలపడిపోయింది అందరిలోనూ. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మౌనం దాల్చారని అనుకోవాలేమో.!
211301 677746In fact your creative writing skills has inspired me to get my own site now. Really the blogging is spreading its wings quickly. Your write up is a great example of it. 509337
687047 791496I actually enjoy reading on this website, it holds wonderful articles . 74722
89270 847657Thanks for the weblog loaded with so several details. Stopping by your weblog helped me to get what I was seeking for. 629946
453475 876937Wow What wonderful information. Thank you for the time you spent on this post. 507694