Switch to English

పవన్‌ మాటలు.. తూటాల్లా పేలుతున్నాయ్‌గానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన ఓడిపోయారు. పార్టీ అధినేత రెండు చోట్లా ఓడిపోతే, పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీతో లేరిప్పుడు. కానీ, జనసేన అధినేత మాత్రం ధైర్యం కోల్పోలేదు. పార్టీ ముఖ్య నేతల సూచన మేరకు, సన్నిహితుల సలహా మేరకు జనసేన అధినేత ట్రాక్‌ మార్చారు.. తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు.

సినిమాల్లో నటిస్తే, రాజకీయాలకు కాస్త బ్రేక్‌ ఇవ్వాల్సిందే. కానీ, అటు సినిమాలు – ఇటు రాజకీయాలు.. బ్యాలెన్సింగ్‌ మిస్‌ అవకుండా అన్నీ పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాకే సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌. మరోపక్క, జనంలోకి వెళుతున్న పవన్‌ కళ్యాణ్‌, ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు ఇంకాస్త భిన్నమైన రాజకీయ వ్యూహాల్ని అనుసరిస్తున్నారు.

‘ఓడిపోయినందుకు బాధ లేదు.. మీలో కొంతమంది అయినా, జనసేన పార్టీకి ఓటేశారు కదా.. ఆ ఓట్లకు న్యాయం చేయాలి కదా..’ అంటూ జనం తరఫున పోరాటంపై తనదైన శౖలిలో వ్యాఖ్యానిస్తున్నారు. ‘అప్పుడు నేను అది చెప్పాను.. మీరు విన్లేదు.. విని వుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు..’ అని పవన్‌ ఎక్కడికి వెళ్ళినా ఆయా అంశాల్ని ప్రస్తావిస్తూ తాను ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన సూచనల గురించి ప్రస్తావిస్తున్నారు.

అమరావతిలోనూ జనసేన వ్యాఖ్యలు తూటాల్లా పేలాయి. ప్రత్యర్థుల్ని తన మాటలతో ఇరకాటంలో పెట్టడం అనేది వేరే విషయం. ఓటర్లను ఆలోచింపజేయడం.. అనేది కాస్త భిన్నమైన ప్రక్రియ. జనసేనాని చేస్తున్నది అదే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది. వైఎస్‌ జగన్‌ పాలనకు సంబంధించి అసంతృప్తితో వున్నవారంతా, జనసేనాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

మరోపక్క ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షంపై పోరాటం చేయడంలో విఫలమవుతున్న దరిమిలా.. జనసేన పార్టీ, రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. అయితే, జనం ఆలోచనల్లో ఈ మార్పు.. వచ్చే ఎన్నికల దాకా ఇలాగే వుంటుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి సినీ నటుడిగా వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకున్నా, 2019 ఎన్నికల్లో జనసేనకు అంత దారుణమైన పరాజయం వచ్చేది కాదు. సో, జనసేన అధినేత.. ఓటర్లను ఆకట్టుకునే విషయంలో ఇంకా చాలా చాలా చేయాలి. టైవ్‌ు వుంది కదా.. ఆయన ఇంకే కొత్త ప్రక్రియలతో జనాన్ని ఎట్రాక్ట్‌ చేస్తారో వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...