Switch to English

వైఎస్‌ జగన్‌ ఢిల్లీ టూర్‌ సూపర్‌ సక్సెస్‌.. హోదా వచ్చేసిందా.?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనపై వైసీపీ అనుకూల మీడియాలో ‘సూపర్‌ సక్సెస్‌’ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ, వైసీపీ అధినేత.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీ టూర్‌ తాలూకు అజెండా ఏమిటి.? అజెండాలో తొలి అంశం ప్రత్యేక హోదాయేనని వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ తర్వాత చాలా అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నది ఇటు వైసీపీ పార్టీ తరఫునా, వైసీపీ ప్రభుత్వం తరఫునా వస్తోన్న సమాధానం.

వైఎస్‌ జగన్‌ ఢిల్లీ టూర్‌ సూపర్‌ సక్సెస్‌ అవడమంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే దస్త్రంపై సంతకం చేసినట్లే భావించాల్సి వస్తుంది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. పోనీ, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేసిందా.? అంటే అదీ లేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల్ని కేంద్రం ఇచ్చిందా.? నో ఆన్సర్‌. మండలి రద్దుపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసకుందా.? అబ్బే, లేదాయె.! మూడు రాజధానుల ప్రతిపాదానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా.? అదీ జరగలేదు. రాజధాని కోసం నిధుల్ని కేంద్రం ప్రకటించిందా.? ఇంకా నయ్యం.. ఏ రాజధానికి కేంద్రం నిధులిస్తుంది చెప్పండి.!

ఇవే కాక, ఇంకా చాలా అంశాలున్నాయి.. కేంద్రం, రాష్ట్రానికి చేయాల్సినవి. వీటిల్లో ఏ ఒక్కదానికీ కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి వుంటే, ఢిల్లీలోనే ప్రధాని సమక్షంలోనే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ కన్పించేది. అయినా, జగన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్సయ్యిందట.. అదీ సూపర్‌ సక్సెస్‌ అని వైసీపీ మీడియా చెబుతోంది.

రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు రాష్ట్రంలో అధికార పార్టీ తీరు చూసి. ఇలాంటి భ్రమల్లో బతకడం వల్లే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తినేసింది. బహుశా ఆ దుస్థితి కోసం వైసీపీ కూడా తహతహలాడుతున్నట్టుంది.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

క్రైమ్ న్యూస్: ఇద్దరు చిన్నారులను కడ తేర్చిన తండ్రి.. తాగిన మత్తులో ఘోరం

ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశుడయ్యాడు. తండ్రిగా విద్యాబుద్దులు చెప్పించి, పెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సింది తాగిన మత్తులో కాటికి చేర్చాడు. విషాదకరమైన ఈ...

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

కొడుకు ప్రాణాలు కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ తండ్రైనా చూస్తూ ఎలా ఊరుకోగలడు. తన ప్రాణాలైనా పణంగా పెట్టి కాపాడాలనుకుంటాడు కదా. ఒక హాలీవుడ్ నటుడు కూడా ఇలాగే కొడుకు ప్రాణాలు కాపాడబోయి తన...