ఎప్పటినుండో వింటోన్న రూమర్స్ ఇప్పుడు ఎట్టకేలకు నిజమయ్యాయి. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ చిత్రం చేయబోతున్నాడు. అయితే ముందు నుండీ అనుకుంటున్నట్లు ఇది రీమేక్ కాదు. సుజీత్ తన సొంత కథతోనే ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా మొదలుపెట్టనున్నారు.
డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. అలాగే రవి కె చంద్రన్ ఈ చిత్రానికి కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో పాటు పోస్టర్ లో ఉన్న డీటెయిల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.