జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. కచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చిన అన్ని సినిమాలను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. కేవలం 24 రోజుల్లోనే వినోదయ సీతం రీమేక్ లో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. ఇక ఏప్రిల్ 5 నుండి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను మొదలుపెడతాడు.
హరీష్ శంకర్ స్పీడ్ గురించి తెల్సిందేగా. కేవలం నాలుగు నెలల్లో పవన్ కళ్యాణ్ పార్ట్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. మే నుండి సుజీత్ దర్శకత్వంలో ఓజి మొదలవుతుంది. అయితే ఈ రెండు సినిమాలు మాత్రం 2023లో విడుదల కావు. సమయం చూసుకుని 2024లో విడుదల చేస్తారు.
ఇక ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న హరిహర వీర మల్లు సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కూడా ఈ ఏడాదే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.