Varun Tej: మెగా ఫ్యామిలీ (Mega Family) ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయనే వార్త టాలీవుడ్ (Tollywood) లో హాట్ టాపిక్ అయింది. దీంతో మరో సినీ జంట నిజజీవితంలో ఒక్కటి కాబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavana Tripathi) ని కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ త్వరలో వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఈనెల 9న వీరి నిశ్చితార్ధం జరుగబోతోంది.
అయితే.. ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది.. అతిధులు ఎవరు.. అనేది ఇంకా తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఫంక్షన్ కు అతికొద్దిమంది మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు, లావణ్య త్రిపాఠీ కుటుంసభ్యులు మాత్రమే నిశ్చితార్ధానికి హాజరవుతారని తెలుస్తోంది. కార్యక్రమం వివరాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లిపై మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.