తెలంగాణ లో మొదటి కరోనా కేసు నమోదై నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా తొలి కరోనా బాధితుడు, వైద్య సిబ్బందితో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో గాంధీ వైద్య సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో తొలి కరోనా బాధితుడిని ఇక్కడే చేర్పించాం. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రి సిబ్బంది చేసిన కృషి ఎనలేనిది. ప్రభుత్వాసుపత్రులపై ఉన్న అపనమ్మకాన్ని చెరిపేశారు. ఆస్పత్రికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్త్తాం’.
‘పేదలకు గాంధీ ఆస్పత్రి ఓ వరం. కరోనా అనేక అనుభవాలు నేర్పింది. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వైరస్ సోకితే ఎలా బయటపడాలో అనే అంశంపై వైద్యులు మేధోమథనం చేయాలి. వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఎనలేని సేవలు చేశారు. వైరస్ వస్తే శవాల గుట్టులు ఉంటాయనే భ్రమ దేశంతోపాటు రాష్ట్రంలో కూడా లేకుండా చేశారు. గాంధీ వైద్యసేవల తరహాలోనే రాష్ట్ర్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో సేవలు విస్తరిస్తాం’ అని అన్నారు.
53935 150378You ought to join in a contest for starters with the highest quality blogs online. I will recommend this page! 346438
908199 400342This is something I truly have to try and do a great deal of analysis into, thanks for the post 440782
768933 956684There couple of fascinating points at some point in this posting but I dont determine if these individuals center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Excellent write-up , thanks and then we want far more! Combined with FeedBurner in addition 14501
896382 495901very nice post, i undoubtedly adore this excellent web site, carry on it 241972