ఆరు పదుల వయసులో బాక్సాఫీస్ వద్ద రెండొందల కోట్ల రికార్డ్ నెలకొల్పడం తెలుగు సినీ పరిశ్రమలో ఇంకెవరికైనా సాధ్యమా.? తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఈ ఘనత సాధ్యమైంది.! నిజానికి, రికార్డులు మెగాస్టార్ చిరంజీవికి కొత్త కాదు.
‘రికార్డుల్లో నా పేరు వుండటం కాదు.. నా పేరు మీదనే రికార్డులు వుంటాయ్..’ అని ‘వాల్తేరు వీరయ్య’లో ఓ డైలాగ్ వుంటుంది. దాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు సినిమా రిలీజ్‌కి ముందు. 200 కోట్ల క్లబ్బులోకి ‘వాల్తేరు వీరయ్య’ అలవోకగా చేరిపోయింది. గ్రాస్ లెక్కలే కావొచ్చు.. ఇదేమీ సాధారణమైన ఫీట్ కాదు. తదుపరి స్టాప్ 250 కోట్లు.! అది కూడా పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
అసలు చిరంజీవి 100 కోట్ల గ్రాస్ అయినా కొల్లగొడతాడా.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రిలీజ్‌కి ముందు. అంతలా సినిమాపై నెగెటివిటీ క్రియేట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీని పూర్తిస్థాయిలో నమ్మాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ నమ్మకం నిజమైంది.
హీరో నమ్మిన దర్శకుడు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. ఆ హీరోకి వచ్చే విక్టరీ ‘వాల్తేరు వీరయ్య’లా వుంటుంది. దర్శకుడికి చిరంజీవి సూచించిన మార్పులు తెరపై బాగా వర్కవుట్ అయ్యాయి. వెరసి, ‘వాల్తేరు వీరయ్య’ ఎవరూ ఊహించని విధంగా బంపర్ విక్టరీ కొట్టింది.
రెండుంపావలా రేటింగులతో రెండొందల కోట్లకు పైగా కొల్లగొట్టడమంటే.. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.! చిత్రమేంటంటే, ఇంకా సోషల్ మీడియాలో ‘వాల్తేరు వీరయ్య’ మీద నెగెటివిటీ నడుస్తుండడం. ఆ నెగెటివిటీ కూడా ఇంకో రకంగా మంచిదే. ఇంకా కసిగా, ‘వాల్తేరు వీరయ్య’ని సగటు సినీ అభిమాని చూస్తున్నాడు.
వింటేజ్ మెగాస్టార్ కాదు.. ఇది ఇంకోటేదో.! అడ్వాన్స్‌డ్ వెర్షన్ మెగాస్టార్ అనుకోవాలేమో.! అలా వుంది వసూళ్ళ ప్రభంజనం.