ఇటివలే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలో మరో మూడు వందే భారత్ రైళ్లు దక్షిణాదికి రానున్నట్టు తెలుస్తోంది. గతేడాది దక్షిణాదిలో చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య తొలి వందే భారత్ రైలు ప్రారంభమైంది. ప్రస్తుతం దక్షిణాదిలో రెండు సెమీ హైస్పీడ్ రైళ్లు ఉన్నాయి.
వీటిని కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-పూణె నగరాల మధ్య సర్వీసులు అందించనున్నట్టు తెలుస్తోంది. ఇటివల ప్రారంభమైన సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు 100శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఈ రైళ్లకు మంచి ఆదరణ దక్కినట్టైంది.
ఈ రైళ్ల మెయింటెనెన్స్ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్లలో ఒక్క కోచింగ్ డిపోలో అయినా మౌలిక సదుపాయాలు పెంచాలని దక్షిణమధ్య రైల్వే డివిజన్ అధికారులు కోరుతున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా 75 వందే భారత్ రైళ్లు నడపాలనేది భారతీయ రైల్వే ఆలోచనగా ఉంది. రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్యను 400 చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.