Switch to English

ఐటమ్, స్టెప్నీ.. నిషేదిత పదాలు.! బూతులైతే శ్రవణానందకరమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి పెట్టారు. ‘ఐటమ్ వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న రోజులివి. అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయాన్ని గుర్తెరగడం మంచిది..’ అంటూ వాసిరెడ్డి పద్మ ఓ ట్వీటేశారు.

ఆ ట్వీటులో సొంత పార్టీ వైసీపీని ప్రస్తావించారు. టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ.. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ పేర్లను కూడా వాసిరెడ్డి పద్మ తన ట్వీటులో పేర్కొనడం గమనార్హం.

మరో ట్వీట్‌లో ‘మహిళల పట్ల నీచాతినీచంగా పోస్టులు పెట్టేవారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని.. స్పెషల్ టీమ్‌లతో సోసల్ మీడియాని కట్టడి చేయాలని మహిళా కమిషన్ ఈ రోజు డీజీపీని కోరింది..’ అని పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ.

ఈ విషయంలో వాసిరెడ్డి పద్మని అభినందించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ, అందరికీ ఒకే తరహా ‘పద్ధతి’ వుండాలని ఆకాంక్షిస్తూ ఆయా రాజకీయ పార్టీలను తన ట్వీట్లలో ప్రస్తావించారు మరి.!

అయితే, ‘ఐటమ్’ వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న రోజులివి.. అని వాసిరెడ్డి పద్మ చెప్పారుగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడైనా అలాంటి శిక్ష పడిందా.? మంత్రిగా వున్న సమయంలోనూ, మంత్రి పదవి పోయాక కూడా కొడాలి నాని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన బూతులు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బూతులు.. వీటన్నిటి సంగతేంటి.?

అయ్యన్న పాత్రుడు మాట్లాడినా, ఇంంకెవరు మాట్లాడినా.. పార్టీలకతీతంగా తొలుత రాజకీయ నాయకులకు శిక్షలు పడాలి. కేసులు పెట్టి ఊరుకోవడం కాదు.! పైగా, ఇలాంటి శిక్షలనేవి అధికార పార్టీ నుంచే మొదలవ్వాలి. అప్పుడే, మిగతావారిలో జాగ్రత్త పెరుగుతుంది. అదే సమయంలో, అధికార పార్టీ బాధ్యతాయుతమైన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది కూడా.!

పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని నోటీసులు ఇచ్చిన ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, ఛండాలమైన బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారో ట్విట్టర్ ద్వారా అయినా చెప్పగలిగితే మంచిది.! కానీ, అంత సాహసం ఆమె చేయగలరా.?

‘చిన్న చిన్న మాటలు మీకు తప్పుడు మాటల్లా అనిపిస్తున్నాయి.. బూతులైతే మహిళా కమిషన్ దృష్టిలో శ్రవణానందకరమా.?’ అని నెటిజన్లు ప్రశ్నించే పరిస్థితి ఎందుకు వస్తోందన్న విషయమై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదేమో.!

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...