Switch to English

పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ మళ్ళీ వచ్చినాడూ.!

91,427FansLike
56,277FollowersFollow

వృద్ధ యువకులట.. యువ వృద్ధులట.. వెధవలట.. ఇంకేదోనట.. ఏంటీ ప్రేలాపన.? అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్రకు సినీ నటుడు శివాజీ మద్దతివ్వడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ క్రమంలో శివాజీ వాడిన పదజాలం అత్యంత అభ్యంతకరం.

ఆర్నెళ్ళకో, ఏడాదికో ఓ సారి మీడియా ముందుకొచ్చి, నోటకొచ్చినట్టు వాగేవాడిని ఏమనాలి.? చంద్రబాబు హయాంలో ‘ఆపరేషన్ గరుడ..’ అంటూ శివాజీ చేసిన హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. శివాజీ చెప్పిన విషయాల్లో కొన్ని నిజమయ్యాయి.. అలాగని, ఆయనేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేశాడనుకుంటే పొరపాటే.

అందరూ అనుకునే విషయాల్ని ఇంకాస్త ఎక్స్‌ప్రెసివ్‌గా చెప్పేసి, టీడీపీకి వంత పాడటంలో శివాజీ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ డాష్ అన్నట్టు.. శివాజీ మీద వివిధ కేసులు నమోదవడం, ఆ కేసుల నేపథ్యంలో నానా తంటాలూ పడటం.. ఇదంతా చూశాం.

మళ్ళీ ఇప్పుడు.. ఇన్నాళ్ళకు ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా.? అంటే, పాత మొహమే.. మార్పులేమీ లేవు. అబ్బే, చంద్రబాబు తనకెందుకు డబ్బలిస్తారంటూ అమాయకంగా ప్రశ్నిస్తూనే.. చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకున్నారు.

సరే, ప్రజలు ఎవర్ని నమ్మాలో వాళ్ళని నమ్ముతారు.. ఎవర్ని గద్దెనెక్కించాలనుకుంటారో, వాళ్ళని గద్దెనెక్కిస్తారు.. అదే ప్రజాస్వామ్యమంటే. అలా చేయడం వల్ల లాభపడేది అయినా, నష్టపోయేది అయినా ప్రజలే. అప్పట్లో చంద్రబాబుని అధికార పీఠమెక్కించిందీ, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది కూడా ప్రజలే.

తేడా వస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దించే శక్తి కూడా ఆ ప్రజలకే వుంది. ఈలోగా ప్రజల్ని నిందించడం ఎంతవరకు సబబు.? ప్రజల్ని చైతన్యపరచడం వరకూ ఎవరూ ఎవర్నీ తప్పు పట్టలేరు. కానీ, ఇదెక్కడి గోల.? వెధవలనడమేంటి.? వెధవతనం కాకపోతే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పవన్...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి గురించి చర్చించుకుంటున్నారు అనే విషయాన్ని వీరు...

చరణ్‌ మంచి మనసు గురించి సల్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న గాడ్‌ ఫాదర్‌ ను హిందీలో కూడా విడుదల చేయబోతున్న నేపథ్యంలో అక్కడ మీడియా...

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2’ USAలో...

కండోమ్స్ కూడా ఫ్రీ ఇవ్వాలా.. విద్యార్థినులతో ఐఏఎస్ ఆఫీసర్‌ దారుణ వ్యాఖ్యలు

బీహార్ కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని హర్‌జోత్ కౌర్‌ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తో అమ్మాయిలు ప్రభుత్వం ఉచితంగా సానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి...