Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 19 నవంబర్ 2021

91,427FansLike
56,277FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:08
సూర్యాస్తమయం : సా‌.5:21
తిథి: కార్తీక శుద్ధ‌ పౌర్ణమి ఉ.12:55 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ పాడ్యమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: ‌కృత్తిక రా.తె.3:40 వరకు తదుపరి రోహిణి
కరణం: బవ ఉ.12:55 వరకు తదుపరి బాలవ
యోగం: పరీఘ రా. తె.3:56 వరకు తదుపరి శివం
వర్జ్యం: మ.2:28 నుండి 4:14 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:22 నుండి 9:07 వరకు తదుపరి మ.12:06 నుండి 12:53 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:50 నుండి 9:14 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:50 నుండి 5:38 వరకు
అమృతఘడియలు: రా.1:02 నుండి 2:48 .వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:39 నుండి 12:23 వరకు

ఈరోజు (19-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

వృషభం: వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

మిధునం: శ్రమాదిక్యాతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు.ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.

కర్కాటకం: చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయట పడగలరు. విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి,ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

సింహం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: కీలక వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది.భాగస్వామి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

తుల: జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహనప్రమాద సూచనలుఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తప్పవు. దూరప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్నిరంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. బందు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

ధనస్సు: మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

మకరం: మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ద వహించాలి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: గృహమున ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.మిత్రులకు ధన సహాయం అందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలను పొందుతారు.

మీనం: అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. క్రయవిక్రయాలలో లాభలు అందుకుంటారు. వృత్తి వ్యాపార లావాదేవీలు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

అన్నా చెల్లి… ఇద్దరికీ 15 ఏళ్లు.. తల్లిని చేశాడు

వాళ్ళిద్దరూ వరుసకు అన్నా చెల్లి అవుతారు.. వారి ఇద్దరి వయసు కూడా 15 ఏళ్ల లోపే.. ఇద్దరు కూడా కలిసి పాఠశాలకు వెళ్లి వస్తూ ఉండేవారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ...

రాశి ఫలాలు: సోమవారం 03 అక్టోబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:54 సూర్యాస్తమయం: సా.5:51 తిథి: ఆశ్వయుజ శుద్ధ అష్టమి సా..4:02 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ నవమి సంస్కృతవారం: ఇందు వాసరః (సోమవారం) నక్షత్రము: పూర్వాషాఢ రా.12:50...

ఈమె అందాలకు హద్దు అదుపు అనేది లేకుండా పోయింది బాబోయ్‌

శ్రియ శరన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అయింది. అయినా కూడా ఈమె అందం విషయం లో ఏ మాత్రం తగ్గలేదు. పదేళ్ల క్రితం ఎలా...

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...

వినోదంతో కూడిన విభిన్న చిత్రం స్వాతిముత్యం: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'స్వాతిముత్యం'. యువ ప్రతిభను పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ వినోదభరితమైన కుటుంబకథా చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ...