Switch to English

అబ్జర్వేషన్‌: జనసేనాని పవన్‌పై ఏడిస్తే ఏమొస్తుంది.?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి నగరమైన విశాఖపట్నంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విషవాయువు ఓ పరిశ్రమ నుంచి లీక్‌ అవడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటిదాకా. దాదాపు 500 మంది ఆసుపత్రులపాలయ్యారు ఈ దుర్ఘటన కారణంగా. రాష్ట్రానికి సంబంధించి ఇది పెను దుర్ఘటనగానే భావించాలి.

ఇలాంటి ఘటనల్లో తక్షణ నష్టం తక్కువగానే వున్నా, భవిష్యత్తులో చోటుచేసుకునే నష్టం అనూహ్యమైన స్థాయిలో వుంటుంది. అందుక్కారణం ప్రమాదకర రసాయనాలు గాల్లో కలవడమే. ఇంతటి దుర్ఘటన జరిగాక, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏం చేస్తోంది.? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

పరిశ్రమల్లో ‘సేఫ్టీ’పై ఆడిట్‌ జరగాలనే డిమాండ్లు తెరపైకి రావడం సహజమే. బాధితులకు నష్ట పరిహారం.. అన్నది వేరే చర్చ. ఇంతటి దుర్ఘటనకు కారణమైన పరిశ్రమపై కరినమైన చర్యలు తీసుకోవాలి. ‘హత్య కేసులు’ పెట్టడమే కాదు, నిందితుల్ని కోర్టు బోనులో నిల్చోబెట్టాలి. కానీ, చరిత్ర చెబుతున్నదేంటంటే.. మన చట్టాలు ఇలాంటి కేసుల్లో నిందితుల్ని శిక్షించలేవని. ప్రభుత్వాలకి అంత చేవ లేదని.

భోపాల్‌ దుర్ఘటనలో ఏం జరిగిందో చూశాం. దాదాపు అలాంటి ఘటనే ఇది కూడా. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇలాంటివి జరగకూడదంటే కరిన చర్యలు తప్పవని జనసేనాని ప్రశ్నించారు. అంతే, ‘కుల మీడియా’ పైత్యం షురూ చేసింది. అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఆ కుల మీడియా, ‘ఓపెన్‌ లెటర్‌’ పేరుతో పవన్‌ కళ్యాణ్‌ని దూషించడం మొదలుపెట్టింది.

నిజానికి, విపక్షాల్ని ప్రశ్నిస్తే.. తద్వారా ప్రజలకు జరిగే మేలు ఏమీ వుండదు. ముఖ్యమంత్రి, బాధితులకు కోటి పరిహారం ప్రకటించారు.. కోటిన్నర ఇవ్వాలని డిమాండ్‌ చేయగలిగితే.. బాధితులకు ఇంకాస్త న్యాయం జరుగుతుందేమో. ఫ్యాక్టరీని అక్కడి నుంచి తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేస్తే, ఆ ప్రాంతం భవిష్యత్తులో ఇంకోసారి ఇలాంటి ప్రమాదానికి గురికాకుండా వుంటుందేమో. అంతే తప్ప, అధికార పార్టీకి చెంచాగిరీ చేద్దామనుకుంటే.. అదసలు మీడియా ఎందుకు అవుతుంది.?

ప్రజాస్వామ్యంలో మీడియా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతిపక్షంగానే వ్యవహరించాల్సి వుంటుంది. అదే మీడియా బాధ్యత కూడా. ప్రభుత్వం తరఫున మంచి సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూనే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. విపక్షాలు ఊరికే విమర్శలు చేస్తాయి.. మీడియా, ఇంకాస్త బాథ్యతాయుతంగా ప్రశ్నిస్తుంది. అంతే తేడా. పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల పేర్లతో ‘ఓపెన్‌ లెటర్లు’ రాస్తే నమ్మేంత వెర్రి వెంగళప్పలెవరైనా వుంటారా.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందన తయారైంది వైసీపీ అనుకూల మీడియా.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

లాక్ డౌన్ ఎఫెక్ట్: స్టార్ హీరోల సినిమాలు ఏ స్టేజ్ లో ఆగిపోయాయో తెలుసా?

కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి....

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...

మహేష్ అభిమానులకు కూడా నిరాశ తప్పేలా లేదు

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ కోసం ఎదురుచూసారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా పనులేం జరగలేదు కాబట్టి ఆర్ ఆర్...

పవన్ తన మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడు. గత రెండేళ్లుగా సినిమాలు చేయకపోయినా తన ఇమేజ్, క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం తన పార్టీని ఆర్ధికంగా బలపరచడం కోసం...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...