War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు. మరో వైపు ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ తన మొదటి హిందీ సినిమా వార్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ మరో హిందీ సినిమాను చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఆ సినిమాను కూడా వార్ 2 నిర్మాతలే నిర్మించబోతున్నారు.
మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే.. వార్ 2 లో ఏ పాత్ర లో అయితే ఎన్టీఆర్ కనిపించబోతున్నాడో అదే పాత్ర లో తదుపరి సినిమాలో కనిపించబోతున్నాడు. వార్ 2 లో కీలక పాత్ర లో కనిపించబోతున్న ఎన్టీఆర్ అదే పాత్ర తో తదుపరి సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు.
అంటే వార్ 2 కి కొనసాగింపు అన్నట్లుగా ఎన్టీఆర్ మరో హిందీ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలు చేయడం కన్ఫర్మ్ అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.