Gami : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం గామి. ఈ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
గామి సినిమాకు గాను సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘A’ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సినిమా కంటెంట్ నేపథ్యంలో యూ/ఏ వస్తుందని భావించారు. కానీ కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండటం, సినిమాకు అది కీలకం అవ్వడంతో తొలగించేందుకు నో చెప్పడంతో సెన్సార్ వారు A ఇచ్చారని తెలుస్తోంది.
ఇప్పటి వరకు విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ ను చూస్తూ ఉంటే అడల్ట్ కంటెంట్ ఎక్కడ ఉన్నట్లుగా అనిపించలేదు. అలాగే అలాంటి కంటెంట్ ఉండే సినిమా అన్నట్లుగా కూడా గామి ప్రమోషనల్ స్టఫ్ ని చూస్తే అనిపించడం లేదు. మరి ఎందుకు సెన్సార్ వారు A ఇచ్చారు అనేది తెలియాలి అంటే మార్చి 8న సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.