Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది అనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా మేకర్స్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫ్యామిలీ స్టార్ లో మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ ముఖ్యమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రష్మిక మరియు దివ్యాంశ కౌశిక్ లు ఇద్దరు కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్న నేపథ్యంలో కచ్చితంగా ఫ్యామిలీ స్టార్ కి అదనపు ఆకర్షణ అన్నట్లుగా ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 5న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.