Switch to English

ప్రతి ఒక్కరికి నచ్చే మాస్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ : నితిన్‌

91,241FansLike
57,311FollowersFollow

నితిన్ హీరోగా రూపొందిన ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధం అయ్యింది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో నితిన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ సందర్బంగా…

చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ మాస్ సినిమా…

ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో వున్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలనే అలోచనతో ‘మాచర్ల నియోజకవర్గం’ చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి.

మాచర్లలో వుండే కొత్తదనం…

కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో వుండే కథ చాలా యూనిక్ వుంటుంది. పొలిటికల్ నేపధ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో వుండే పాయింట్ చాలా కొత్తగా వుంటుంది.

మాచర్ల నియోజికవర్గంలో ఆకట్టుకున్న పాయింట్

కథ కొత్తగా యూనిక్ గా వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. ఫుల్ ఎంటర్ టైమెంట్, మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ వున్నాయి. ఫ్యాన్స్ కి పండగలా వుంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

రాజశేఖర్‌ పై ఎందుకు నమ్మకం…

2017 ‘లై ‘షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టయిల్ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను ఇన్ పుట్స్ కూడా బావుండేవి. ”నువ్వు డైరెక్టరైతే బావుంటుంది” అని అప్పుడే చెప్పాను. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను.

కొత్త దర్శకులతో కొన్ని ఇబ్బందులు..

శేఖర్ ఎడిటర్ కావడం వలన షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, లెంత్ విషయంలో చాలా క్లారిటీ వుంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. శేఖర్ ఎడిటర్ కావడం వలన .. ఎంత కావాలో అంతే తీశాడు. శేఖర్ నేను అనుకున్న దానికి కంటే అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. చాలా అనుభవం వున్న దర్శకుడి లాగా తీశాడు.

దర్శకుడు శేఖర్ మీ స్నేహితుడు కదా…

శేఖర్ ఒక ఫీల్డ్ మార్చి మరో ఫీల్డ్ కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఆ ఫీల్డ్ కి వెళ్ళాలి. అందుకే ఈ సినిమా నాకంటే కూడా తనకే ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ఐఎఎస్ పాత్ర కోసం హోం వర్క్…

ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఎఎస్ అధికారులని కలవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందా గా వుండాలి, ఎక్కడ మాస్ గా ఉండాలనేది తనే చెప్పాడు.

మాచర్ల నియోజికవర్గం కు యాధార్ధ సంఘటనల స్ఫూర్తి…

యధార్థ సంఘటనల స్ఫూర్తి ఏం లేదు. మాచర్ల నియోజికవర్గం కంప్లీట్ ఫిక్షనల్ స్టొరీ. దర్శకుడు శేఖర్ ది గుంటూరు. మాచర్ల అనే టైటిల్ లో ఒక ఫోర్స్ వుంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని టైటిల్ పెట్టాం.

కలెక్టర్ అంటే కొంచెం సాఫ్ట్ గా వుంటారు….

ఐఎఎస్ అంటే క్లాస్ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్ గా వుంటే ఎలా వుంటుందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్ గా వెళ్లాం.

ట్రైలర్ లో మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్..

ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ గా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్ లా కాకుండా మాస్ కూడా క్లాస్ టచ్ తో వుంటుంది.

మాచర్ల నియోజికవర్గం ఫ్యామిలీ ఆడియన్స్ కి ..

మాచర్ల నియోజికవర్గం ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్ , మాస్, క్లాస్ అన్నీ వుంటాయి.

క్యాథరిన్ పాత్ర సర్ప్రైజ్…

క్యాథరిన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్ ఆ పాత్రలో వుంటుంది.

మాచర్ల లో మీ పాత్రలో సవాల్..

చాలా రోజుల తర్వాత చేసిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఫైట్స్, లుక్ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా.

కృతి శెట్టిని స్మార్ట్…

అవును. తన షూటింగ్ లో ప్రతిది చాలా లాజికల్ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్ గా వుంటాయి. హీరోయిన్స్ లో అరుదైన క్యాలిటీ ఇది.

మీ కెరీర్ లో బెస్ట్ ఫైట్స్…

ఇది వరకు నా చిత్రాలలో ఫైట్స్ వున్నాయి. కానీ మాచర్ల ఫైట్స్ మాత్రం చాలా స్పెషల్. పవర్ ఫుల్, ఇంపాక్ట్ ఫుల్, స్టయిలీష్ గా వుంటాయి. ఒకొక్క ఫైట్ ఒక్కోలా వుంటుంది. షూటింగ్ లో ఫైట్స్ అలవాటే. కానీ మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయి.

మహతి స్వరసాగర్ సంగీతం…

సాగర్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు. మా ఇద్దరి సింక్ బావుంటుంది,. మాచర్ల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. నేపధ్య సంగీతంలో మణిశర్మ గారిని మైమరపించాడు.

‘విక్రమ్’ సినిమా విషయంలో మీ సలహా వుందని నాన్నగారు చెప్పారు..

సలహా అంటే .. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్ళను (నవ్వుతూ). విక్రమ్ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా., ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా.

ఇరవై ఏళ్ల ప్రయాణం తృప్తి…

ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలనేదే నా ప్లాన్.

‘రానురాను’ పాట రీమిక్స్ ఆలోచన..

ఈ ఆలోచన నాదే. ఏదైనా పాట రీమిక్స్ చేద్దామని అన్నప్పుడు జయం హైలెట్స్ లో ఒకటైన రానురాను పాటని మిక్స్ మిక్స్ చేద్దామని చెప్పాను. సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్…

వక్కంతం వంశీ గారితో ఒక సినిమా చేస్తున్నా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్- లోకేశ్ కనగరాజ్ సినిమా ‘లియో’..! ఆసక్తి పెంచుతున్న టీజర్

ఖైదీ, విక్రమ్ సినిమాలు తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ తో మాస్టర్...

బాలయ్య షో లో కనిపించని చిరు అక్కడ ప్రత్యక్షం అయ్యారు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి...

సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు

ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది....

అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్‌ కిడ్‌

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్...

సువర్ణసుందరి రివ్యూ: బోరింగ్ ట్రీట్మెంట్

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో...

రాజకీయం

ఉత్త ‘సలహా’కి వృధాగా ఖర్చవుతున్న ప్రజాధనం.!

‘మేం అస్సలు అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటోంది వైసీపీ సర్కారు.! సరే.. అది నిజమే అనుకుందాం.! సలహాదారుల సంగతేంటి.? కుప్పలు...

నెల్లూరు పెద్దా‘రెడ్ల’ ముందస్తు రాజకీయం.?

అదేంటో, అధికార పార్టీకి సొంత సామాజిక వర్గంగా చెప్పబడే ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచే ప్రకంపనలు మొదలయ్యాయ్.! నెల్లూరు జిల్లాకి చెందిన ఇద్దరు ‘రెడ్లు’ పార్టీ వీడనున్నారు. మరో ‘రెడ్డి’గారూ అసంతృప్తితో వున్నారు....

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..! టీడీపీ నేత లక్ష్మీనారాయణ..

లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైన హీరో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. హీరో బాలకృష్ణ...

సచివాలయంలో అగ్ని ప్రమాదం.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

తెలంగాణ లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను సచివాలయం చూసేందుకు వెళ్తానంటే అడ్డుకున్నారని అన్నారు. అందుకే తాను...

కోటంరెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం పార్టీకి నష్టం లేదు: మంత్రి కాకాణి

ఎమ్మెల్యే కోటంరెడ్డికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని.. అదొక మ్యాన్ టాపింగ్ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి టీడీపీ ఉచ్చులో చిక్కుకుని...

ఎక్కువ చదివినవి

సింహాలు ఇంటర్వ్యూలు ఇవ్వవు.. అందుకే నేనూ ఇవ్వట్లేదు: షారుఖ్ ఖాన్

పఠాన్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంతోషంలో మునిగిపోయారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇంత ఆనందంలో ఉన్న షారుఖ్ అభిమానులతో #ASKSRK వేదికగా సంభాషించారు. అభిమానులు అడిగిన పలు...

విశాఖే రాజధాని.! ‘త్రీ క్యాపిటల్స్’ నాటకానికి ‘జగన్’ మార్కు ముగింపు.!

ఎవరు.? మూడు రాజధానులన్నదెవరు.? మళ్ళీ ఒకటే రాజధాని అంటున్నదెవరు.? ఇంకెవరు.. అన్నీ ఆయనే చెబుతారు. మాట తప్పనంటారు, మడమ తిప్పబోనంటారు. కానీ, మాట తప్పుతారు.. ఎడా పెడా మడమ తిప్పేస్తారు. దటీజ్ వైఎస్...

ఇది క్లియర్.! టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ గల్లంతే.!

‘వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు.? ఈ విషయమై వైసీపీ వాదన చూస్తే ‘నవ్వులాట’ని తలపిస్తోంది. ఆ పార్టీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుని వదిలేసి...

పవన్ కల్యాణ్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’..! ప్రారంభమైన కొత్త సినిమా ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త సినిమా ప్రారంభమైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ సినిమాను...

ఆయనో ఎన్ సైక్లోపీడియా.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం: చిరంజీవి

కళాతపస్వి కె.విశ్వనాధ్ ఇకలేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నట్టు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాధ్ భౌతికకాయాన్ని చిరంజీవి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన గొప్పదనం చెప్పేందుకు తన స్థాయి...