Switch to English

ఇంటర్వ్యూ: అది నాకు పవన్ కళ్యాణ్ మీదున్న లవ్వు – నితిన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

“నేను మీమ్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్ చేశాను. అందుకే ‘భీష్మ’లో ప్రతి సీనూ ఫన్నీగా ఉంటుంది. విలన్ కు వార్నింగ్ ఇవ్వడంలోనూ ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. మంచి రోల్” అని చెప్పారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో సంభాషించారు నితిన్. ఆ విశేషాలు…

‘భీష్మ’ ….. ఈ కథ ఎప్పుడు ఓకే చేశారు?

నేను ‘శ్రీనివాస కల్యాణం’ చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ లైన్ చెప్పాడు. నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. మునుపటి మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నా. ఈ టైంలోనే ‘రంగ్ దే’ స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన ‘పవర్ పేట’ స్క్రిప్ట్, హిందీ సినిమా ‘అంధాధున్’ రీమేక్ కూడా ఓకే ఛేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి.

‘భీష్మ’ ఎలా ఉంటుంది?

‘దిల్’ తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు.అది కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానికి ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్‌లో ఎలివేట్ చెయ్యలేదు.

ట్రైలర్లో ఒక ఫైట్ ‘అతడు’లోని పొలం ఫైట్ ను గుర్తు చేస్తోంది. దాని స్ఫూర్తితో తీశారా?
కరక్టే. ‘అతడు’లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.

సంగీతానికి ప్రాముఖ్యం ఉన్నట్లు కనిపిస్తోంది..

అవునండీ. మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘వాటే బ్యూటీ’ కానీ, ‘సరాసరి గుండెల్లో’ కానీ, సింగిల్స్ యాంథెం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు.

మొదట మహతిని కాకుండా వేరే  చాయిస్ కు వెళ్దామని మీరు అన్నట్లు వినిపించింది నిజమేనా?
నిజమే. అంతా ‘ఛలో’ టీం అయిపోతోందని, మహతినైనా మార్చమని వెంకీకి చెప్పా. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనన్నా. మహతి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి వెంకీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.

డాన్సుల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు?

చివరిగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఎక్కువ డాన్స్ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి కానీ ఎక్కువ డాన్స్ చెయ్యలేదు. ఈ సినిమాకు ముందే అనుకొని డాన్స్ చేసాం. తెరమీద నా డాన్స్ చూసినవాళ్లు కచ్చితంగా ఇష్టపడతారు.

రష్మికతో పనిచేయడంపై ఏమంటారు?

తెరపై రష్మిక అద్భుతంగా ఉంది. చక్కని నటి. మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు.

మీ ప్రతి సినిమాలో పవన్ కల్యాణ్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎందుకట్టా… ప్రమోషన్ కోసమేనా?

‘జయం’ నుంచి నా ప్రతి సినిమాలో ఆయన ప్రస్తావన ఉంది. ఆయన పాటో, ట్యూనో, పోస్టరో, డైలాగో.. ఉంటూ ఉంది. ‘ఇష్క్’తో సక్సెస్ వచ్చాక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయనపై నాకున్న ప్రేమ. నేను ఆయనకు స్వచ్ఛమైన అభిమానిని. మీరు ఎంత దాని గురించి రాసినా దాన్ని పెడుతూనే ఉన్నా. అది నా లవ్. అంతే!

‘భీష్మ’ చేసే టైంలోనే మరో రెండు సినిమాలూ చేస్తుంటే, క్యారెక్టర్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవలేదా?

ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ కాబట్టి కన్ఫ్యూజ్ కాలేదు. వెంకీ కుడుములకు డైలాగ్స్ చెప్పేటప్పుడు కళ్లార్పడం ఇష్టముండదు. అదే యేలేటి గారైతే, కళ్లు ఆర్పమంటాడు. ఎప్పుడైనా కాస్త కన్ఫ్యూజ్ అయినా ఆ డైరెక్టర్లే మళ్లీ తమ క్యారెక్టర్ లోకి నన్ను తీసుకొచ్చేవాళ్లు. కానీ ఇంకెప్పుడూ లైఫ్ లో ఒకేసారి మూడు సినిమాలు చెయ్యనండీ బాబూ.. నిద్ర లేదు, రెస్ట్ లేదు. ఎప్పుడైనా ఒకరోజు గ్యాప్ వస్తే, ఆ రోజు తమకు కావాలని ముగ్గురూ కొట్టుకొనేవాళ్లు. ఇప్పుడు ‘భీష్మ’ అయిపోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. యేలేటి గారితో చేస్తున్న సినిమా పేరు ‘చెక్’. చెస్ ఆటలో ‘చెక్’ అనే మాట వస్తుంది కదా.. అదే.

నిర్మాణ విలువల గురించి ఏం చెబుతారు?

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానంటేనే ఈ బ్యానర్ అంటే ఎంత ఇష్టపడుతున్నానో మీరే ఊహించుకోండి. వీళ్లు తీసే అన్ని సినిమాల్లో నిర్మాణ విలువలు హై లెవల్లో ఉంటాయి. ‘అ ఆ’ మూవీ నుంచి ఈ బ్యానర్ తో నా జర్నీ మొదలైంది. ‘భీష్మ’ తర్వాత మళ్లీ ఇదే బ్యానర్ తో ‘రంగ్ దే’ చేస్తున్నా. దాని తర్వాత కూడా మరో సినిమా చేద్దామని నిర్మాత నాగవంశీ అంటున్నారు.
 
‘జయం’ నుంచి ఎక్కువగా లవ్ స్టోరీలే చేస్తూ వచ్చారు. బోర్ అనిపించలేదా?

కథలన్నీ ఒకదానికొకటి భిన్నమైనవి కాబట్టి బోరేమీ ఫీలవలేదు. ఇప్పుడు డిఫరెంట్ గా చెయ్యాలనే ఉద్దేశంతోనే యేలేటి గారి సినిమా చేస్తున్నా. ‘అంధాధున్’ డిఫరెంట్ సినిమా, ‘పవర్ పేట’ డిఫరెంట్ సినిమా. నేను కూడా లవ్ స్టోరీస్ తగ్గించే ఆలోచనలో ఉన్నాను. ‘రంగ్ దే’ లవ్ స్టోరీ అయినప్పటికీ, ఆ కథ నాకు బాగా నచ్చేసింది. అందులో నేను 24 ఏళ్ల యువకుడిగా కనిపిస్తా. మళ్లా అలాంటి క్యారెక్టర్ చెయ్యలేను కాబట్టి ఒప్పుకున్నా.

పెళ్లి ఫిక్సయినందుకు కంగ్రాట్స్. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ.. ఆ వివరాలు చెప్తారా?

దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం, 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిచేసుకోబోతున్నాం. 21న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం. 2012లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శాలిని పరిచయమయ్యింది. అది స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. నేనే తనకు తొలిసారి నా ప్రేమను వ్యక్తం చేశా. తనూ యాక్సెప్ట్ చేసింది. గత సంవత్సరం ఇద్దరం ఇట్లోవాళ్లకు ఈ విషయం చెప్పాం. అప్పటి దాకా వాళ్లకూ ఈ విషయం తెలీదు.నిజానికి మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ మ్యారేజ్ అనేది జీవితంలో పెద్ద స్టెప్ కాబట్టి, ఆలోచించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఒక ప్లాన్ ప్రకారమే మేం ఎక్కడా మా ప్రేమను బయట వ్యక్తం చెయ్యకుండా ఉంచగలిగాం. మీడియా అటెన్షన్ ఒద్దనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది నా ఆలోచన కాదు. శాలిని, ఆమె తల్లిదండ్రులు, మా అమ్మానాన్నల ఆలోచన.బ్యాచిలర్ లైఫ్ ముగిసిపోతోందంటే …నాకంటే నా తోటి హీరోలు చాలా ఆనందపడుతున్నారు. నాని ‘దా దా’ అంటున్నాడు. రానా, వరుణ్ తేజ్ కూడా కామెంట్ చేస్తున్నారు. నాకైతే ఇప్పటికే చాలా లేటైపోయిందనిపిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...