బాలీవుడ్ హిట్ మూవీ అంధాదున్ ను తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఈ రీమేక్ లో నితిన్ నటిస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో భీష్మ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నితిన్ మాట్లాడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
అంధాదున్ రీమేక్ లో నటించాలంటే చాలా భయంగా ఉంది. ఆ సినిమాలో నటించిన ఆయుష్మాన్ కి అవార్డు రావడంతో నా టెన్షన్ మరింత ఎక్కువ అయ్యిందని నితిన్ చెప్పుకొచ్చాడు. దాంతో ఆ రీమేక్ లో నితిన్ నటిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడని, త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లుగా నితిన్ ప్రకటించాడు.
ప్రస్తుతం మూడు సినిమాలను చేస్తున్న నితిన్ చుక్కలు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒకేసారి మూడు సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి సందర్బాలను నేను మళ్లీ ఫేస్ చేయాలని కోరుకోవడం లేదు. ఇకపై ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగానే చేస్తాను. మూడు సినిమాలు ఒకేసారి చేయడం వల్ల దేనికి కూడా పూర్తిగా సంతృప్తిగా టైం ను కేటాయించలేము అనే ఉద్దేశ్యంలో తాను ఉన్నట్లుగా నితిన్ చెప్పుకొచ్చాడు.
605036 904368I just could not go away your website before suggesting that I incredibly enjoyed the usual info a person supply to your guests? Is going to be back ceaselessly so that you can inspect new posts. 214095
860061 239673When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this write-up. 731807
565170 262020There is noticeably a great deal of dollars to realize about this. I suppose you created particular good points in functions also. 54744