Switch to English

అమరావతి ఎపిసోడ్‌లో ‘సూపర్‌ ట్విస్ట్‌’ ఇదే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని అసెంబ్లీలోనే నిర్ణయించారు.. ఈ మేరకు అప్పట్లో తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి అనుగుణంగానే రాజధానిని డిసైడ్‌ చేయడం జరిగింది. మరి, అదే అసెంబ్లీకి రాజధానిని మార్చే హక్కు ఎందుకు వుండదు.? ఇదీ ఉన్నత న్యాయస్థానం సంధించిన ప్రశ్న.

రాజధాని అమరావతి విషయమై హైకోర్టులో విచారణ సందర్భంగా, న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అధికార పార్టీకి ఇది నిజంగానే పెద్ద ఊరట. నిజానికి, న్యాయస్థానం వ్యాఖ్యలు చేయడంతోనే, ఇదే తుది తీర్పు.. అని ఎవరైనా సంబరపడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

మరోపక్క, అమరావతి తరఫున వాదనలు కూడా ఆసక్తికరంగానే వున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టంతోనేననీ, ఆ చట్టంలోనే రాజధాని అంశాన్ని పేర్కొన్న దరిమిలా, రాజధాని విషయమై ఎలాంటి మార్పు జరగాలన్నా అది పార్లమెంటు ద్వారానే సాధ్యమవుతుందన్నది అమరావతి రైతుల తరఫున న్యాయవాది వాదన. అయితే, ఈ వాదనలు కొత్తవేమీ కాదు. ఎప్పటినుంచో జరుగుతున్నవే. ఇప్పుడు న్యాయస్థానాల్లో విచారణ సందర్భంగా ఆయా అంశాలు ఆసక్తికరంగా తెరపైకొస్తున్నాయి.

అమరావతిని అసెంబ్లీనే నిర్ణయించింది.. అదే అసెంబ్లీ అమరావతితోపాటు మరో రెండు రాజధానులని చెబుతోందిప్పుడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అసెంబ్లీలో బలాబలాలు మారిపోతాయి. ప్రతిసారీ అసెంబ్లీలో తీర్మానం చేసేసి రాజధానిని మార్చేస్తామంటే కుదురుతుందా.? కొన్నిసార్లు ప్రభుత్వాలు నెలల వ్యవధిలోనే కుప్పకూలిపోతుండడం చూస్తుంటాం. అలాంటప్పుడు, నెలకో రాజధాని.. అంటే ఎలా.? ఇలాంటి చాలా ప్రశ్నలున్నాయి.

ప్రస్తుతానికి తెరపైకి వచ్చిన ప్రశ్న, ‘అసెంబ్లీనే రాజధానిని నిర్ణయించింది గనుక, ఆ అసెంబ్లీకి రాజధానిని మార్చే హక్కు వుంటుంది కదా..’ అని. ఈ ప్రశ్న అధికార పార్టీకి నచ్చింది గనుక పండగ చేసేసుకుంటున్నారు.. లేకపోతే, న్యాయమూర్తులపైనా, న్యాయవ్యవస్థపైనా బురదచల్లడం అధికార పార్టీకి అలవాటే కదా.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...