Switch to English

ఓటిటి రివ్యూ: అమ్మోరు తల్లి – ఈ తల్లి పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయింది.!

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow
Movie అమ్మోరు తల్లి
Star Cast నయనతార, ఆర్.జె బాలాజీ
Director ఆర్.జె బాలాజీ - ఎన్.జె శరవణన్
Producer ఇషారి కె గణేష్
Music గిరీష్.జి
Run Time 2 గంటల 15 నిముషాలు
Release నవంబర్ 14, 2020

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో, కమెడియన్ ఆర్జే బాలాజీ హీరోగా నటించిన మూకుత్తి అమ్మన్ తమిళ సినిమాని ‘అమ్మోరు తల్లి’గా తెలుగులో అనువదించారు. థియేటర్స్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటిటి ద్వారా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఏంగెల్స్ రామస్వామి(ఆర్.జె బాలాజీ) ఉత్తరాంధ్ర టీవీలో ఓ సాధారణ రిపోర్టర్.. తను నివసించే ఊరికి చుట్టు పక్కల ఉన్న 11 వేల ఎకరాల పంచవనంని ప్రజల్ని మభ్య పెట్టి గవర్నమెంట్ ద్వారా భగవతి బాబాకి ఇచ్చేస్తారు. ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకు రావాలని రామస్వామి చాలానే ట్రై చేస్తాడు. కానీ ఎవ్వరు నమ్మరు. అలాంటి సమయంలో రామస్వామికి తన కులదైవమైన ముక్కుపుడక అమ్మవారు(నయనతార) కనిపించడంతో పాటు, తన పంచావనాన్ని కాపాడుకోవడానికే వచ్చానని చెబుతుంది. మొదట రామస్వామి నమ్మడు. కానీ ముక్కుపుడక అమ్మవారిని రామస్వామి ఎలా నమ్మాడు? పంచావనాన్ని కాపాడడం కోసం అమ్మవారు రామస్వామితో కలిసి ఎలా పోరాడాడు? ఎలా భగవతి బాబా దొంగ బాబా? అని నిరూపించారు అనేదే కథ.

తెర మీద స్టార్స్..

ముందుగా నయనతార గురించి చెప్పుకోవాలి.. అమ్మవారి గెటప్ లో పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా, అటు భయపెట్టే సన్నివేశాల్లో, మరోవైపు నవ్వించే సన్నివేశాలు అమ్మవారు అనే బాలన్స్ చాలా పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ చేయడం సూపర్బ్ అని చెప్పాలి. ఇక ఆర్.జె బాలాజీ ఎప్పటిలానే తన కామెడీ పెర్ఫార్మన్స్ తో నవ్విస్తాడు. డబ్బింగ్ వలన తెలుగులో కాస్త అటు ఇటు అనిపించినా, తమిళ్ లో మాత్రం ఇంటిని డైలాగ్స్ బాగా పేలుంటాయి అని చెప్పచ్చు. ఊర్వశి గారు తల్లి పాత్రలో ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా బాగా చేసి, నవ్విస్తుంది. అజయ్ ఘోష్ బాబాగా బాగా సరిపోయాడు. ముఖ్యంగా తన చేత చేయించిన కొన్ని హావా భావాలు నవ్వు తెప్పిస్తాయి. మిగిలిన నటీనటులు ఉన్నంతలో బాగానే చేశారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా సినిమాకి మూలం అయిన కథ విషయానికి వస్తే.. ఒక దేవత కేవలం తన భక్తుల కష్టాలు తీర్చడం కోసమే కాకుండా, అవసరం అయితే తనని, తన సంస్థానాన్ని కాపాడుకోవడం కోసం భూమి మీదకి వస్తుందనే అంశాన్ని ఇతి వృత్తంగా చేసుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి కథల్ని మనం చూసాము కాబట్టి కథా పరంగా పెద్దగా కొత్తగా అనిపించదు. కానీ కథనంలో ప్రస్తుతం ప్రజల మెంటాలిటీ ఎలా ఉంది అనేదాని మీద దేవుడు అనే దాన్ని వివరించిన సన్నివేశాలు బాగున్నాయి. కానీ ఓవరాల్ గా కథనంలో చూసుకుంటే అన్నీ మనం అనుకుంటున్నట్టే జరుగుతాయి కాబట్టి పెద్దగా కిక్ ఉండదు. క్లైమాక్స్ లో దేవుడే వచ్చి సందేహాలు తీర్చాలని రాసుకున్న ఐడియా కొత్తగా ఉంటే, ఆ సన్నివేశాన్ని ఎఫెక్టివ్ గా చెప్పకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు హడావిడిగా చెప్పి ఫినిష్ చెయ్యడం బాలేదు. ఇక డైరెక్టర్స్ ఆర్.జె బాలాజీ – ఎన్.జె శరవణన్ లు సెటైరికల్ గా సొసైటీలో జరుగుతున్న చాలా అంశాలను బాగానే చెప్పారు. కానీ అనుకున్న పాయింట్ ని చివర్లో అయినా ఇంకాస్త స్ట్రాంగ్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ప్రస్తుత పరిస్థితుల మీద వేసే సెటైర్స్ మనకు బాగానే కనెక్ట్ అయినా ఓవరాల్ గా సినిమా మాత్రం ఓకే ఓకే అనిపిస్తుంది.

ఇక దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ, గిరీష్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్ గా ఉండి, కాస్త రన్ టైం తక్కువగా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నయనతార పెర్ఫార్మన్స్
– ఆర్.జె బాలాజీ సెటైరికల్ కామెడీ
– ఇప్పటి పరిస్థితులకు రిలేట్ అయ్యే కొన్ని సీన్స్
– స్టోరీ లోని మెసేజ్

బోరింగ్ మోమెంట్స్:

– అందరికీ తెలిసిన, చూసేసిన కథ
– ఆసక్తిగా లేని కథనం
– ఎక్కువ భాగం బోరింగ్ అనిపించడం
– ఇంకా బెటర్ గా ఉండాల్సిన క్లైమాక్స్
– సాగదీసిన రన్ టైం

విశ్లేషణ:

నయనతార అమ్మవారి పాత్రలో చేసిన ‘అమ్మోరు తల్లి’ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకోదు, కానీ కాస్త సెటైరికల్ కామెడీ ఇష్టపడే వారికి మాత్రం ఒకసారి చూడచ్చు అనిపిస్తుంది. ఆ.జె బాలాజీ – నయనతార సీన్స్ రియాలిటీకి దగ్గరగా ఉండి అందరినీ ఆకట్టుకుంటే, అందరికీ తెలిసిన కథ, కథనం మరియు బోరింగ్ మోమెంట్స్ సినిమాపై ఆసక్తిని చంపేస్తాయి. దీపావళి పండుగ రోజున రిలీజైన అమ్మోరు తల్లి సినిమా పెద్దగా ఎంటర్టైన్ చేయలేదనే చెప్పాలి.

చూడాలా? వద్దా?: జస్ట్ నాలుగు నవ్వులు ఉన్నా చాలు చూసేద్దాం అనుకునే వాళ్ళు చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...