Nani32 : నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాని ఈ ఏడాది కూడా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు నాని కమిట్ అయ్యాడు. ఇప్పటికే నాని మరియు సుజీత్ కాంబో మూవీ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఆ సినిమా ను దానయ్య బ్యానర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా కూడా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ప్రస్తుతం దర్శకుడు సుజీత్ ‘ఓజీ’ సినిమాను చేస్తున్నాడు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా చివరి దశలో ఆగిపోయింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే నాని తో సుజీత్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడట. ఆ విషయాన్ని నాని కూడా తన ట్వీట్ లో పేర్కొన్నాడు. పవర్ మూవీ తర్వాత మనదే అన్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.