Ram Charan : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
గత ఏడాది నుంచి వాయిదాలు వేస్తూ మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి కచ్చితంగా అనుకున్నారు. కానీ అసలు ఈ ఏడాదిలో వస్తుందా అనే అనుమానాలు మొదలు అయ్యాయి. గేమ్ చేంజర్ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేయడంతో పాటు పలు ఆసక్తికర విషయాలు సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ లేదా మే నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా ముందు వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ మరో వైపు బుచ్చి బాబు సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ సినిమా 2025 సమ్మర్ లేదా దసరా కి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.