‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రమైన రాజకీయ సమీకరణాలు తెరపైకొచ్చాయి. కులం, మతం, ప్రాంతం… ఇలా దేన్నీ వదల్లేదు పోటీలో నిలబడ్డ ప్యానళ్ళకు చెందిన పోటీదారులు.. మరీ ముఖ్యంగా మంచు విష్ణు ప్యానల్ నుంచి కొంత జుగుప్సాకరమైన ప్రవర్తనే కనిపించిందన్నది సినీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.
ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ క్యాంప్ కూడా ఒకింత గట్టిగానే ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుని అనూహ్యంగా మంచు క్యాంప్ తెరపైకి తెచ్చి, ఆయన ద్వారా ప్రకాష్ రాజ్ మీద విమర్శలు చేయించింది. ఈ వ్యవహారంపై సినీ నటుడు నాగబాబు ఒకింత తీవ్రంగానే స్పందించారు.
కోట శ్రీనివాసరావుని జంతువుతో పోల్చారు నాగబాబు. అయితే, నాగబాబు ఇంత తీవ్రంగా స్పందించడానికి బలమైన కారణం లేకపోలేదు. ప్రకాష్ రాజ్ని స్థానికేతరుడనీ, పరభాషా నటుడనీ కోట వ్యాఖ్యానించడాన్ని నాగబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజమే, ప్రకాష్ రాజ్ కన్నడిగుడు. కానీ, తెలుగు నేలపై స్థిరపడ్డాడు. తెలుగు నాట పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ని తప్పుపట్టలేం. పైగా, ‘మా’ ఎన్నికల్లో స్థానికేతరుడు పోటీచేయకూడదనే నిబంధన ఏమీ లేదు కదా.?
ప్రకాష్ రాజ్ మీద మతం పేరుతోనూ విమర్శలు చేసింది మంచు విష్ణు ప్యానల్. ఈ నేపథ్యంలోనే నాగబాబు తీవ్రంగా స్పందించినట్లు భావించాలేమో. కోట శ్రీనివాసరావు మీదనే కాదు, బాబూ మోహన్ (మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నాడండోయ్.) మీద కూడా నాగబాబు తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు.
అన్నట్టు, గతంలో ఇదే కోట శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణ తన మొహమ్మీద ఉమ్మేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. వయసు మీద పడ్డాక ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అవి వాస్తవాలనుకోవాలో.. ఇంకేమన్నా అనుకోవాలో అర్థం కాని పరిస్థితి.
కాగా, కోట మొదటి నుంచీ ప్రకాష్ రాజ్ పట్ల వ్యతిరేక భావంతోనే వున్నారు. ఆ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో బయటపెట్టుకున్నారు.
469466 722855This really is a fantastic internet page, could you be interested in doing an interview about just how you created it? If so e-mail me! 491052
747735 18483Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a look at that? 134424
371357 686020I totally agree! I came more than from google and am seeking to subscribe. Exactly where is your RSS feed? 130573
310586 341691This is really intriguing, Ill have a look at your other posts! 676518