మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి తెలుగు మీడియాలో హైప్ ఎందుకు క్రియేట్ అవ్వాలి.? అసలు చర్చా కార్యక్రమాలు ఎందుకు న్యూస్ ఛానళ్ళలో జరగాలి.? ఈ చర్చల వల్ల ప్రయోజనమేంటి.? ఈపాటి ఇంగితం ఏమాత్రం లేకుండా, టీఆర్పీ రేటింగుల కోసం న్యూస్ ఛానళ్ళు కక్కుర్తి పడ్డాయి.
కొందరికి మీడియా అటెన్షన్ అవసరమైంది.. మీడియాకెక్కారు. మీడియాకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. ‘మా’ ఎన్నికల పోలింగ్ రోజున, అంతా ఒక్కటైపోయారు సినీ పరిశ్రమలో. ప్రధాన పోటీదారులైన ప్రకాష్ రాజ్ – విష్ణు ఆత్మీయ ఆలింగనాలు, ఈ క్రమంలో మోహన్‌బాబు, ప్రకాష్ రాజ్‌ని దగ్గరకు తీసుకుని, విష్ణుతో చేతులు కలిపేలా చేయడం.. ఇదంతా మీడియాకి పెద్ద షాకే ఇచ్చినట్లయ్యింది.
‘ఈమాత్రందానికి ఇంతలా కొట్టుకోవడమెందుకు.? ఇప్పుడిలా కలిసిపోవడమెందుకు.?’ అని మీడియా ప్రతినిథులు తలపట్టుక్కూర్చున్నారు. ‘మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది కదా.?’ అన్న డైలాగు మెగాస్టార్ చిరంజీవి నుంచి చాలామంది నటుల ద్వారా మీడియాకి ఎదురయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే, న్యూస్ ఛానళ్ళు ఈ వ్యవహారంలో వెర్రి వెంగళప్పాయలైపోయాయన్నది నిర్వివాదాంశం.
నాగబాబు కావొచ్చు, ప్రకాష్ రాజ్ కావొచ్చు.. ముందే ఈ విషయాన్ని చెప్పారు, మీడియాని హెచ్చరించారు కూడా సున్నితంగా. ‘ఇది మీడికెక్కే వ్యవహారం కాదు. న్యూస్ ఛానళ్ళలో రచ్చ చేయడం కాదు, సభ్యులతో మాట్లాడి, వాళ్ళకు ఏం చెయ్యగలమో చెప్పుకుందాం..’ అని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
నిజమే, 900 మంది సభ్యులకు ఎన్నికల మేనిఫెస్టో అంశాల్ని వివరించాల్సిందిపోయి, మీడియాకెక్కి రచ్చ చేసుకున్నారు. మీడియా కూడా, ఆ సినీ పాపులారిటీని క్యాష్ చేసుకుని, టీఆర్పీ రేటింగులు పెంచుకుంది. అదీ అసలు సంగతి.
ఎవరు గెలుస్తారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మొత్తం వ్యవహారంలో న్యూస్ ఛానళ్ళ తీరు ఆక్షేపణీయంగా తయారైంది. ఏవేవో స్పెక్యులేషన్స్.. సినీ జనాల మధ్య నిప్పు రాజేసే ప్రయత్నాలు.. అబ్బో, న్యూస్ ఛానళ్ళు ఈసారి ‘మా’ ఎన్నికల నేపథ్యంలో చేసిన ఓవారక్షన్ అంతా ఇంతా కాదు.
రేపటి నుండి దిక్కుమాలిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్సు సన్నాసులు తమ ఛానల్ టీఆర్పీ ల కోసం ఛీఛీరెడ్డి, పో సాని, సన్నాసి నరేష్ లతో బండబూతుల తిట్లు షోలు కండక్టు చేస్తారేమో?
185894 887821Outstanding post, I conceive men and women really should larn a whole lot from this web internet site its actually user genial . 693433
306999 322663I feel this is among the most significant information for me. And im glad reading your article. But want to remark on some common issues, The web web site style is perfect, the articles is actually wonderful : D. Great job, cheers 306654
426054 518195This kind of publish appears to get yourself a great deal of visitors. How will you acquire traffic to that? It provides a fantastic unique twist upon issues. I guess having something traditional or maybe substantial to give info on will be the central aspect. 698041