Switch to English

స్పోర్ట్స్ న్యూస్: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఎమ్మెస్‌ ధోనీ.. నెక్స్‌ట్‌ ఏంటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు. గతంలోనే టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఎమ్మెస్‌ ధోనీ, తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కి సంబంధించి అన్ని ఫార్మాట్ల నుంచీ తప్పుకుంటున్నట్లు వెల్లడించడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ధోనీ కాస్సేపటి క్రితం సోషల్‌ మీడియా వేదికగా తన రిటైర్‌మెంట్‌ గురించి ప్రకటించాడు. నిజానికి, ఈ నిర్ణయాన్ని ధోనీ అభిమానులు అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియాకి ఎన్నో చారిత్రక విజయాలు అందించిన ఎమ్మెస్‌ ధోనీ, ఇంకొన్నాళ్ళు భారత క్రికెట్‌లో కొనసాగాలన్నది అభిమానుల కోరిక. అయితే, వయసు మీద పడ్తున్న దరిమిలా, ధోనీ.. గౌరవంగానే క్రికెట్‌ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేసినా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మాత్రం ధోనీ మెరుపుల్ని మనం ఇంకొన్నాళ్ళు చూసే అవకాశం వుంది.

బ్యాటుతో బాదిన పరుగులు, వికెట్ల వెనకాల పట్టిన క్యాచ్‌లు.. ఇలా మాట్లాడుకుంటే, ధోనీ రికార్డులు చాలానే వున్నాయి. అవన్నీ ఓ ఎత్తు.. కెప్టెన్సీ ఇంకో ఎత్తు. ధోనీ, మొత్తంగా ప్రపంచ క్రికెట్‌లోనే ది బెస్ట్‌ కెప్టెన్‌గా మేటి క్రికెటర్ల ప్రశంసలు అందుకున్నాడు. అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో జట్టుని గట్టెక్కించడానికి ధోనీ, అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలావరకు సత్పÛలితాలనిచ్చాయి. వీటిల్లో టీ20 తొలి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఒకటి. ఒక్కసారి కాదు.. చాలాసార్లు అలా టీమిండియా నరాలు తెగే ఉత్కంఠ నడుమ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే విజయాల్ని అందించిందంటే.. అది ధోనీ గొప్పతనంగానే చెప్పుకోవాలి.

టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుని, వన్డే – టీ20 ఫార్మాట్లకు సంబంధించి కెప్టెన్సీని వదులుకున్నా, ఆ తర్వాత కెప్టెన్‌గా మారిన కోహ్లీ నేతృత్వంలోనూ ‘పెద్దన్నగానే’ తన సత్తా చాటాడు. గత కొంతకాలంగా ధోనీ రిటైర్‌మెంట్‌ గురించి చాలా ఊహాగానాలు విన్పిస్తున్న విషయం విదితమే. ‘రిటైర్‌మెంట్‌పై ధోనీనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు..’ అని బీసీసీఐ పెద్దలు పలు సందర్భాల్లో చెప్పారు. తాజాగా ధోనీ చేసిన ప్రకటనని చూస్తే, ధోనీ కొద్ది నెలల ముందే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఆ విషయాన్ని కాస్త లేటుగా ప్రకటించాడంతే.

ప్రస్తుతం ధోనీ, భారత సైన్యంలోనూ సేవలందిస్తున్నాడు. ఏదిఏమైనా, ధోనీ స్థానంలో ఇంకొకర్ని ఊహించలేం. గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రావిడ్‌, సౌరవ్‌ గంగూలీ.. ఇలా ఎంతోమంది మహామహులు ఇండియన్‌ క్రికెట్‌కి అత్యద్భుతమైన సేవలు అందించారు. అయితే, ఎమ్మెస్‌ ధోనీ ఇంకాస్త ప్రత్యేకం. ధోనీకి టీమిండియాలో రీప్లేస్‌మెంట్‌ చాలా చాలా కష్టం. బ్యాట్‌తో పరుగులు రాబట్టి, వికెట్ల వెనకాల సత్తా చాటి, కెప్టెన్సీతో టీమిండియాని విజయ పథాన నడిపించే ఆటగాడ్ని చూడగలమా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...