Switch to English

పవనిజం.. పవన్ కళ్యాణ్ ‘ట్రెండ్ పవర్‘.. ఆ రికార్డుల కిక్కే వేరప్పా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

సినిమా ఫ్లాపయితే కుంగిపోలేదాయన.. సినిమా హిట్టయినప్పుడు పొంగిపోలేదు కూడా.! నిజానికి, తన సినిమా ప్రమోషన్ల మీద ఎక్కువగా ఫోకస్‌ పెట్టేవారు కాదు. అయినా, సినిమా సినిమాకీ రేంజ్‌ పెరిగింది తప్ప తగ్గలేదు. ‘ఇతర హీరోల్లా మీరు కూడా సినిమా ప్రమోషన్లపై ఫోకస్‌ పెట్టరెందుకు.?’ అనడిగితే, ‘సినిమాని ప్రమోట్‌ చేస్తే, ఫ్లాప్‌ సినిమా కూడా ఆడేస్తుందా.? సినిమాలో సత్తా వుంటే ప్రమోట్‌ చేయాల్సిన అవసరం వుండదు. సినిమా కోసం ఎంత కష్టపడాలో.. అంతకన్నా ఎక్కువే కష్టపడ్తాం. ఆ తర్వాత ఫలితం ప్రేక్షకుల చేతుల్లో వుంటుంది. ఒక్కోసారి అనుకున్నవి అనుకున్నట్టుగా తెరకెక్కవు. అలాక్కూడా ఫ్లాపులొస్తుంటాయ్‌..’ అని చెబుతుండేవారాయన.

తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరది. ఆయన పేరులోనే ‘పవర్‌’ వుంది. ఆయనే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ దగ్గర్నుంచి, చివరిగా రిలీజ్‌ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమా వరకూ పవన్‌ కళ్యాణ్‌ దాదాపుగా సినిమా అంటే అదే కమిట్‌మెంట్‌తో పనిచేశారు. ఆయన వ్యక్తిత్వమే ఆయన బలం. అదే, ఆయన అభిమానుల్ని ‘పవనిజం’ అనే ఓ ప్రత్యేకమైన ‘బంధం’తో బలంగా ముడిపడేలా చేసింది. ‘ఇజం’ అని ఓ సినిమా హీరో అభిమానులు చెప్పుకోవడం మొదలైంది పవన్‌కళ్యాణ్‌తోనేనంటే అది అతిశయోక్తి కాదేమో. తన సినిమా రికార్డు స్థాయిలో వసూళ్ళను కొల్లగొట్టినా.. పరాజయం పాలైనా.. పవన్‌ కళ్యాణ్‌లో పెద్దగా మార్పు కన్పించదు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ పవన్‌ కళ్యాణ్‌, తాను నమ్మిందే చేస్తారు. నిజాయితీగా వ్యవహరిస్తారు. బహుశా సినిమాల్లో చెల్లిన ఆ నిజాయితీ, ఇప్పుడున్న రాజకీయాలకు సరిపడదేమో.. అందుకే, రాజకీయాల్లో ఆయన ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఎన్నికల్లో డబ్బు పంచి వుంటే జనసేన పరిస్థితి ఇప్పుడెలా వుండేదో ఏమో.! ఆ డబ్బు పంచకపోవడంతోనే జనసేన పార్టీ అంటే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్లో మరింత గౌరవం పెరిగింది.. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరంగానే వున్నా. ఎన్నికల సమయంలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు స్వచ్ఛందంగా గ్రౌండ్‌ లెవల్‌లో పనిచేశారు. అదీ ఆయన మీద వారికున్న గౌరవం, నమ్మకం. రాజకీయాల్లో గెలుపోటముల వెనుక చాలా కారణాలుంటాయ్‌. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప, ఆ గెలుపోటముల గురించి ఆలోచించి.. అడ్డదారిలో రాజకీయాలు చేయాలన్న ఆలోచన ఏనాడూ పవన్‌ కళ్యాణ్‌కి లేదు. కులం పేరుతో రాజకీయాలు చేశారు.. వ్యక్తిగత విమర్శలు చేశారు.. జనసేనపై అందరూ కలిసి గూడు పుఠానీ చేసినా, అభిమానులు ఇప్పటికీ జనసైనికుల్లా.. పార్టీ కోసం పనిచేస్తూనే వున్నారు. ఆ అభిమానుల ‘పవర్‌’ ఏంటన్నది ఎప్పటికఫ్పుడు సోషల్‌ మీడియాలో కన్పిస్తూనే వుంది.

ప్రస్తుత రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే అడ్డదారులు తొక్కాల్సిందే. ఆ విషయంలో దిగజారిపోవడం ఇష్టం లేక.. ఇంకా, ‘మార్పు’ కోసం పరితపిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఇంకోపక్క సినిమాల్లోనూ కొనసాగాలని నిర్ణయం తీసుకోవడం.. సినిమాల్లో నటిస్తుండడం తెలిసిన సంగతులేమో. సోషల్‌ మీడియాలో ‘ట్రెండింగ్‌’ అన్నదానికి నిలువెత్తు నిదర్శనం పవన్‌ కళ్యాణ్‌. పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ విషయమ్మీద అయినా.. ఒక్కసారి ట్రెండింగ్‌ షురూ అయ్యిందంటే.. రికార్డులు బద్దలవ్వాల్సిందే. సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ‘కామన్‌ డిపి’తో అభిమానులు పండగ షురూ చేశారు. పుట్టినరోజు నాడు ఆ సంబరం ఇంకే స్థాయిలో వుంటుందో.. ఆ రికార్డులు ఏ స్థాయిలో బద్దలవుతాయో వేచి చూడాల్సిందే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...