Switch to English

పప్పు.. గన్నేరు పప్పు.. వదిలిపోతోంది సోషల్‌ ‘తుప్పు’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నిన్న ఏం మాట్లాడాం.? మొన్న ఏం మాట్లాడాం.? అన్నది మైండ్‌లో పెట్టుకుని ప్రవర్తించాలి. రేపు ఏం మాట్లాడాలో కూడా ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే, ఇది ఒకప్పటి నిఖార్సయిన రాజకీయం కాదు.. ఈ రాజకీయం వేరే. ఇప్పుడు రాజకీయాల్లో ఏం మాట్లాడినా, వెంటనే ‘సరదా’ తీర్చేస్తున్నారు నెటిజన్లు. ‘అప్పుడేం మాట్లాడావ్‌.? ఇప్పుడేం మాట్లాడుతున్నావ్‌.?’ అని నిలదీసేస్తున్నారు. బుకాయించడానికి వీల్లేదిప్పుడు.! అసలు విషయంలోకి వస్తే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిగారి పుత్రరత్నానికి వైసీపీ ‘పప్పు’ అని పేరు పెట్టింది. ‘తెలుగు మాట్లాడటం రాని మూర్ఖుడు’ అంటూ వైసీపీ నేతలు లోకేష్‌ మీద విరుచుకుపడ్డారు. ‘జయంతికీ వర్ధంతికీ తేడా తెలియదా.?’ అంటూ ఎగతాళి చేశారు.

మరిప్పుడు, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నోట వస్తున్న ఆణిముత్యాలేంటి.? అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ జగన్‌ చాలాసార్లు ‘సోషల్‌ మీడియాకి’ అడ్డంగా దొరికేశారు. ‘గన్నేరు పప్పు’ అంటూ వైఎస్‌ జగన్‌కి టీడీపీ పేరు పెట్టేసింది కూడా. తాజాగా, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వైఎస్‌ జగన్‌ నోట చాలా తప్పులు దొర్లేశాయి. ‘ఇందుకే కదా.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మీడియం కూడా వుండాలనేది..’ అంటూ జగన్‌ మీద విరుచుకుపడుతున్నారు. ‘మీకు తెలుగు సరిగ్గా మాట్లాడటం రావట్లేదని.. ఎవర్నీ తెలుగులో మాట్లాడనీయకుండా చేయడానికి తెలుగు మీడియంని ఎత్తేస్తున్నారా.?’ అన్నది వారి నిలదీత. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఇట్నుంచి నాలుగు రాళ్ళు వెళితే.. అట్నుంచి నలభై నాలుగు రాళ్ళు వచ్చి మీదపడతాయి.. ఇదిగో ఇలాంటి ట్వీట్ల రూపంలో. ‘గన్నేరు పప్పు’ హ్యాష్‌ట్యాగ్‌తో టీడీపీ మద్దతుదారులు వేస్తోన్న ట్వీట్లకు వైసీపీ మద్దతుదారులు సమాధానం చెప్పలకే బిక్కచచ్చిపోతున్నారనడం అతిశయోక్తి కాదేమో.

గతంలో నారా లోకేష్‌ పరిస్థితి కూడా ఇలాగే వుండేది. బహుశా నారా లోకేష్‌తో తెలుగు పాండిత్యంలో వైఎస్‌ జగన్‌ పోటీ పడుతున్నారేమో.? అన్నది ఇంకో పార్టీ మద్దతుదారుడి సెటైర్‌ సారాంశం. ప్రసంగాల్లో తప్పులు దొర్లడం పెద్ద నేరమేమీ కాదు. దాన్ని కేవలం పొరపాటుగానే భావించాలి. ఆయా వ్యక్తుల్ని కించపర్చడం ద్వారా పైశాచికానందం పొందడం నిజంగా తప్పే. కానీ, అప్పుడు వైసీపీ మద్దతుదారులు తిట్టారు.. వైసీపీ నేతలూ తిట్టారు. దానికి ఇప్పుడు కౌంటర్‌ ఎటాక్‌ అన్నమాట. అంతా బాగానే వుందిగానీ.. ప్రజా సమస్యలపై నెటిజన్లకు ఇంత శ్రద్ధ ఎందుకు వుండట్లేదట.? ఇది కాస్త ఆలోచించాల్సిన ప్రశ్నే.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...