Switch to English

సినిమా రివ్యూ: ఆవిరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు: ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్..
నిర్మాత: రవిబాబు
దర్శకత్వం: రవిబాబు
సినిమాటోగ్రఫీ: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
మ్యూజిక్: వైధి
ఎడిటర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
విడుదల తేదీ: నవంబర్ 1, 2019
రేటింగ్: 1/5

చేసేవి చిన్న సినిమాలే కానీ ప్రేక్షకులకి గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి, బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ సాధిస్థాయి.. అలాంటి సినిమాలకి కేరాఫ్ అడ్రస్సే మన డైరెక్టర్ రవిబాబు. ‘అవును’, ‘అవును 2’ లాంటి సినిమాల తర్వాత రవిబాబు చేసిన మరో హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆవిరి’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ని థ్రిల్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

బిజీ బిజీ లైఫ్ గడిపే పేరెంట్స్ రవిబాబు – నేహా చౌహాన్.. వీరిద్దరి పెద్ద కుమార్తె ఆస్థమా వల్ల చనిపోతుంది. వారి రెండవ ముద్దుల కుమార్తె మున్ని(శ్రీ ముక్త), తనకి కూడా ఆస్థమా ఉంటుంది..అందుకే తనని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచడం వలన బాగా లోన్లీ గా ఫీలవుతుంది. అదే టైంలో తనకి అదే ఇంట్లో ఉన్న ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. ఇక అక్కడి నుంచి మున్ని చేసే కొన్ని పనులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత ఓ రోజు సడన్ గా మున్ని కనపడకుండా పోతుంది. ఇక అక్కడి నుంచి రవిబాబు మున్ని ఎక్కడికి వెళ్ళింది? ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు? మున్ని కనపడకపోవడం వలన రవిబాబు – నేహా చౌహాన్ లు పడ్డ ఇబ్బందులేంటి? ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? ఆ దెయ్యానికి మున్నీకి ఉన్న సంబంధం ఏమిటి?ఫైనల్ గా మున్ని దొరికిందా? లేదా? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

  • చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీ ముక్త చేసిన నటన చాలా బాగుంది. తనకి ఇచ్చిన ప్రతి ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా చూపించింది.

  • ‘హుషారు’ ఫేం ప్రియా వడ్లమాని పాత్ర బాగుంది. తన ఎమోషన్ సినిమాకి కొంతవరకూ హెల్ప్ అయ్యింది.

  • అక్కడక్కడా పరవాలేధనిపించే ఒకటి రెండు థ్రిల్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.

ఆఫ్ స్క్రీన్:

  • పరవాలేధనిపించే ఎన్. సుధాకర్ రెడ్డి విజువల్స్.. కొంతవరకూ ఆ విజువల్స్ వల్లే మనకి కాసేపు చూడాలనిపిస్తుంది.

ఓవరాల్ ప్లస్ పాయింట్స్:

  • శ్రీ ముక్త పెర్ఫార్మన్స్

  • క్లైమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

  • నటీనటుల పెర్ఫార్మన్స్ చెప్పుకోదగిన రేంజ్ లో లేవు..

  • ఇదొక హార్రర్ థ్రిల్లర్ సినిమా, కానీ ఇందులో మిమ్మల్ని భయపెట్టే సీన్స్, అబ్బా అనుకునే ఒక్క థ్రిల్ కూడా లేకపోవడంతో, ఆడియన్స్ కి ఇక ఏ పరంగా ఇది హార్రర్ థ్రిల్లర్ సినిమా అని ఎలా చెప్పుకున్నారబ్బా అనే ఫీలింగ్ వస్తుంది.

  • మొదటి నుంచి చివరి వరకూ సినిమా చాలా స్లోగా అనిపించడం వలన చాలా సార్లు నిద్రపోతాం కూడాను..

ఆఫ్ స్క్రీన్:

  • రవిబాబు చిన్న కథని చాలా ఎంగేజింగ్ గా చెప్తారు. కానీ ఈ సారి కథలో దమ్ము లేకపోవడం వలన ఒక ఫాల్స్ కథ చెప్తూ అసలైన కథ క్లైమాక్స్ లో చెప్పాలనుకున్నాడు. కానీ ఆ ఫార్మాట్ చాలా సార్లు చెప్పేయడం వలన ఆడియన్స్ ముందే ఊహించేస్తారు. అందువల్ల కథ హార్రర్ పరంగానూ, ఎమోషనల్ పరంగా కనెక్ట్ అవ్వదు. ఆయనకి సక్సెస్ ఇచ్చిన అవును జానర్లో ఈ సినిమా చేసినప్పటికీ రవిబాబుకి గత సినిమాలా అదుగో రేంజ్లోనే ఈ సినిమా కూడా డిజాష్టర్ అయ్యేలా ఉంది. డైరెక్టర్ గా రవిబాబు కంప్లీట్ గా ఫెయిల్ అయిన సినిమా ‘ఆవిరి’.

  • సత్యానంద్ గారు రాసిన స్క్రీన్ ప్లే కూడా హెల్ప్ అవ్వలేదు. ప్రతి కామన్ ఆడియన్ ఊహించేయగల ఇలాంటి సిల్లీ స్క్రీన్ ప్లే ఆయన రావడం ఏంటా అని ఆలోచించాల్సిన పరిస్థితి.

  • వైధి మ్యూజిక్ కూడా చాలా లౌడ్ గా ఉంది తప్ప, సినిమాని ఎంగేజ్ చేసేలా లేదు.

  • ఎడిటింగ్, షార్ట్ రన్ టైం కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

ఓవరాల్ నెగటివ్ పాయింట్స్:

  • వీక్ స్టోరీ

  • స్క్రీన్ ప్లే వారు రాసిన దానికన్నా మీరే బెటర్ గా రాయగలరు.

  • ఆడియన్స్ ని కూర్చోబెట్టలేకపోయిన రవిబాబు డైరెక్షన్

  • ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశం ఒక్కటి కూడా లేకపోవడం

  • భయపెట్టలేకపోయిన హార్రర్ ఎలిమెంట్స్

విశ్లేషణ:

‘అవును’ సీరీస్ తో భలే హార్రర్ ఫిల్మ్ చేసాడే అనిపించుకున్న డైరెక్టర్ రవిబాబు ఈ సినిమాతో ప్రేక్షకుల నుంచి ఇంత చెత్త బొమ్మ తీశాడేంటి అనే టాగ్ లైన్ ని అందుకున్నారు. ఒక హార్రర్ సినిమా అని చెప్పినపుడు, కనీసం కొన్ని చోట్లయినా భయపెట్టి ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోవడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. నటన పరంగా శ్రీ ముక్త అనే చైల్డ్ ఆర్టిస్ట్ కి తప్ప ఎవ్వరికీ ఉపయోగం లేని ఈ సినిమాని ఆడియన్స్ కూడా మాకొద్ద ఇలాంటి సినిమాలు మేము చూడలేం బాబోయ్ అని మధ్యలోనే వెళ్లిపోతున్నారు. మొదటి వీకెండ్ లోనే కనపడకుండా ఆవిరైపోయే సినిమా ‘ఆవిరి’.

ఫైనల్ పంచ్: ఆవిరి – సినిమాకి వెళ్తే మీరు ఆవిరైపోతారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...
నటీనటులు: ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్.. నిర్మాత: రవిబాబు దర్శకత్వం: రవిబాబు సినిమాటోగ్రఫీ: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి మ్యూజిక్: వైధి ఎడిటర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌ విడుదల తేదీ: నవంబర్ 1, 2019 రేటింగ్: 1/5 చేసేవి చిన్న సినిమాలే కానీ ప్రేక్షకులకి గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి, బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ సాధిస్థాయి.. అలాంటి సినిమాలకి కేరాఫ్ అడ్రస్సే మన డైరెక్టర్ రవిబాబు....సినిమా రివ్యూ: ఆవిరి