నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ, అభినవ్, పావని గంగిరెడ్డి, వాణి భోజన్, అవంతిక మిశ్రా..
నిర్మాత: విజయ్ దేవరకొండ – వర్ధన్ దేవరకొండ
దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
మ్యూజిక్: శివకుమార్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
విడుదల తేదీ: నవంబర్ 1, 2019
హీరోగా తనకి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ మన రౌడీ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి, తన “కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్” పతాకంపై రూపొందించిన మొదటి సినిమా “మీకు మాత్రమే చెప్తా”. వెన్నెల కిషోర్ వాయిస్ తో ప్రతి ఫోన్ లోనూ ఓ సీక్రెట్ ఉంటదిగా అనే లైన్ తో, ట్రైలర్ అందరినీ ఆకట్టుకొని సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. మరి కంప్లీట్ ఫన్ రైడ్ లా ఉంటుందని చెప్పిన ‘మీకు మాత్రమే చెప్తా’ నేడు విడుదలైంది. మరి ఈ రైడ్ మరియు ఆ ఫోన్ లోని సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కథ:
మనహీరో రాకేష్ (తరుణ్ భాస్కర్), అతని ఫ్రెండ్ కామేష్ (అభినవ్). కామేష్ ఒక ఓల్డ్ బ్యాచ్ తో క్రికెట్ ఆడుతూ రాకేష్ లైఫ్ లో జరిగిన ఒక సీక్రెట్ వాళ్ళకి చెప్తాడు. రాకేష్ ఎన్నో అబద్దాలు చెప్పి ఫైనల్ గా స్టెఫీ(వాణి భోజన్)తో పెళ్లి ఫిక్స్ చేసుకుంటాడు. కానీ రెండు రోజుల ముందు, రాకేష్ కి సంబందించిన ఓ సీక్రెట్ వీడియో నెట్ లో లీక్ అవుతుంది. ఈ వీడియో చూడగానే రాకేష్ ఫ్యూస్ లు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఆ వీడియో తనకి కాబోయే భార్య చూస్తే పెళ్లి, పరువు అన్ని పోతాయని భావించి ఉన్నపలంగా ఆ వీడియోని నెట్లో తీసేయించాలని జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? ఆ ఇబ్బందులన్నీ క్రాస్ చేసి ఫైనల్ గా ఆ వీడియో అప్లోడ్ చేసిన వారిని చేరుకున్నారా? లేక ఈ లోపు ఆ వీడియో వల్ల నాన్న, కాబోయే భార్య చూసేసిందా? అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అనేదే అసలైన కథ.
సీటీమార్ పాయింట్స్
ఆన్ స్క్రీన్:
-
తరుణ్ భాస్కర్ నటన ఫెంటాస్టిక్ అని చెప్పాలి. తరుణ్ డైరెక్టర్ కంటే యాక్టర్ గా రెండు రెట్లు ఎక్కువ మార్క్స్ కొట్టేసాడు. ముఖ్యంగా టెన్షన్ పడే సీన్స్, కామెడీ ఎక్స్ ప్రెషన్స్, వాయిస్ మాడ్యులేషన్ అన్నీ కేక అనే రేంజ్ లో చేసాడు.
-
అభినవ్ గోమటం హీరో పాత్రతో ఫుల్ లెంగ్త్ ట్రావెల్ అవుతూ ప్రేక్షకులని బాగానే నవ్వించాడు. ఇతని వన్ లైనర్స్ కొన్ని థియేటర్లో బాగానే పేలాయి.
-
అనసూయ, వాణి భోజన్, అవంతిక మిశ్ర, పావని గంగి రెడ్డిల పాత్రలు ఉన్నంతలో బాగానే చేశారు.
-
సినిమా పరంగా.. ట్విస్ట్ రివీల్ అవ్వడం, కేఫ్ లో ‘రంభ థియేటర్ ‘ డైలాగ్ సీన్, గర్ల్ ఫ్రెండ్స్ పరంగా చెప్పే కొన్ని సీన్స్, అక్కడక్కడా చిన్న చిన్న మోమెంట్స్ నవ్విస్తాయి.
ఆఫ్ స్క్రీన్:
-
టెక్నికల్ గా బెస్ట్ అంటే డైలాగ్స్ గురించి చెప్పాలి. షమ్మీర్ సుల్తాన్ – తరుణ్ భాస్కర్ కలిసి రాసిన డైలాగ్స్ లో వన్ లైనర్స్ చాలా వరకూ పేలాయి.
-
మదన్ గుణదేవా సినిమాటోగ్రఫీ విజువల్ గా చాలా బాగుంది.
-
శివ కుమార్ మ్యూజిక్ లో స్పెషల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలి. చాలా సీన్స్ డల్ గా ఉన్నా, ఇతని మ్యూజిక్ హెల్ప్ అయ్యింది.
-
రాజ్ కుమార్ ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది.
ఓవరాల్ ప్లస్ పాయింట్స్:
-
తరుణ్ భాస్కర్ – అభినవ్ ల పెర్ఫార్మన్స్ అండ్ ట్రాక్స్
-
బాగా పేలిన వన్ లైనర్స్
-
ఆకట్టుకునే క్లైమాక్స్ ట్విస్ట్
-
గుడ్ అనిపించే ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్
ఆన్ స్క్రీన్:
-
సినిమా చాలా స్లోగా మొదలవుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత పికప్ అయ్యి మళ్ళీ డ్రాప్ అవుతుంది.
-
ఇంటర్వల్ ఎపిసోడ్ లో కూడా పెద్ద కిక్ ఉండదు.
-
సెకండాఫ్ పరిగెత్తిస్తాడు అనుకుంటాం కానీ సింపుల్ గా తేల్చేసి చాలా బోరింగ్ గా క్లైమాక్స్ కి వరకూ లాగాడు.
-
అనుకున్న అన్ని ఫన్ ట్రాక్స్ వర్కౌట్ అవ్వలేదు.
-
షార్ట్ ఫిల్మ్ ని సాగదీసి సినిమాగా చెప్పడం.
ఆఫ్ స్క్రీన్:
-
కథే సినిమాకి హీరో.. దాని ప్రకారం ఈ సినిమా కథని చూస్తే.. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అయిన ‘ది రోడ్ ట్రిప్’ కి కాపీ లా ఉంటుంది. ఆ సినిమా ఆ టైంకి తగ్గట్టు వీడియో టేప్ గురించి కథ నడిపిస్తే, ఈ కథ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఆల్రెడీ అప్లోడ్ అయిన వీడియో కోసం జరుగుతుంది. అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. కానీ ఆ సినిమా కామెడీ పరంగా పిచ్చ పిచ్చగా నవ్వించి అక్కడ ట్రెండ్ స్టెట్టింగ్ హిట్ గా నిలిచింది. కానీ ఇక్కడ కామెడీ అంతగా వర్కౌట్ కాకపోవడంతో కామన్ ఆడియన్స్ ఏందిరా ఈ కథ ఇంతోటి దానికా ఈ 2 గంటల గోల ఏందో అనే ఫీలింగ్ వస్తుంది.
-
పోనీ కథ పరంగా చాలా సింపుల్ కానీ కథనంతో మేజిక్ చేయచ్చు. ఈమధ్య డెబ్యూట్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న పని అదే.. అలానే ట్రై చేయాలనుకున్న ఈ డైరెక్టర్ షమ్మీర్ సుల్తాన్ కథనం విషయంలో కంప్లీట్ గా సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కొంతవరకూ హోల్డ్ చేస్తాడు సెకండాఫ్ స్టార్టింగ్ లోనే మొత్తం చెప్పేసి మిగతా బోరింగ్ గా తీసుకెళ్లాడు. తను అనుకున్న స్లాప్ స్టిక్ కామెడీ మరియు కన్ఫ్యూషన్ కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు.
-
డైరెక్టర్ గా షమ్మీర్ సుల్తాన్ కొన్ని సెన్సిబిలిటీ కామెడీస్ ని నీట్ గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే డైలాగ్ రైటర్ గా కూడా బెస్ట్ కానీ 2 గంటల సినిమాని ఆడియన్స్ కి ఎంగేజ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. బేసిక్ గా ఇతను సింపుల్ పాయింట్స్ తో షార్ట్ ఫిలిమ్స్ తీసి మెప్పించాడు. కానీ సినిమా అన్నప్పుడు ఇంకొంచం స్ట్రాంగ్ పాయింట్ అండ్ ఎమోషన్ ఉండాలి. ఆ విషయంలో రైట్ డెషిషన్ తేలిపోవడం వలన డైరెక్టర్ గా జస్ట్ 35 మార్క్స్ తో పాస్ అయ్యాడు.
-
విజయ్ దేవరకొండ – వర్ధన్ దేవరకొండల ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ వీరు అనుకున్న అవుట్ ఫుట్ తెరపైకి రాలేదు, ఎందుకంటే వాళ్ళు నేరేషన్ లో ఎంజాయ్ చేసినంత, థియటర్ లో ఎంజాయ్ చేయలేకపోయాము.
ఓవరాల్ నెగటివ్ పాయింట్స్:
-
కాపీ కథ
-
అక్కడక్కడే తిప్పి బోరింగ్ గా చెప్పిన స్క్రీన్ ప్లే
-
బెటర్ గా తీయాల్సింది.
-
ఎడిటర్ ఇంకా ట్రిమ్ చేయాల్సింది.
-
సినిమాని ముందుకు తీసుకెళ్లకుండా అక్కడక్కడే తిప్పుతూ ఉండడం.
-
క్లైమాక్స్ తప్ప మిగతా ఆయె ట్విస్ట్ అండ్ టర్న్ వర్క్ అవ్వలేదు.
విశ్లేషణ:
‘మీకు మాత్రమే చెప్తా’ లో సీక్రెట్ మేము రివీల్ చెయ్యట్లేదు కానీ ఆ సీక్రెట్ చుట్టూ తిరిగే ఈ సినిమా కొన్ని చోట్ల మిమ్మల్ని నవ్విస్తుంది, కానీ చాలా చోట్ల మీకు బోరింగ్ అనిపిస్తుంది.. ఫస్ట్ హాఫ్ నవ్వుల్తో పరవాలేధనిపించి, సెకండాఫ్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇస్తా అనే ఫీల్ ని జెనరేట్ చేసి సెకండాఫ్ ని చెత్తగా చెప్పడం వలన, చివరికి ఆడియన్స్ కి ఏందో ఈ గోల అనే ఫీలింగ్ వస్తుంది. మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్స్ వారికి కొంతవరకూ బాగా అనిపించవచ్చు, కానీ మిగిలిన ఆడియన్స్ మాత్రం లైట్ తీసుకుంటారు. ఈ సినిమా వల్ల ఉపయోగం అంటే తరుణ్ భాస్కర్ కి నటుడిగా మంచి పేరొస్తుంది. షమ్మీర్ సుల్తాన్ డైలాగ్స్ కి పేరొస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే 2 గంటల ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కంటే 2 నిమిషాల ట్రైలర్ కట్ సూపర్బ్ ఉంది. సో మరొకసారి ట్రైలర్ చూసి నవ్వుకొని, సినిమాని లైట్ తీస్కోండి.
ఫైనల్ పంచ్: మీకు మాత్రమే చెప్తా – ట్రైలర్ అదుర్స్, కానీ సినిమా తుస్..!
