| Firstname | |
|---|---|
| Movie Name | |
| Star Cast | |
| Director | |
| Producer | |
| Run Time | |
| Release Date | |

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న క్రాస్ ఓవర్ చిత్రం `నిశ్శబ్దం`. సాక్షి అనే అమ్మాయిగా అనుష్క వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే సినిమాలో మరో ప్రధాన పాత్రధారి మాధవన్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రీసెంట్‌గా సినిమా ప్రీ టీజర్ కూడా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న అంజలి లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ, మలయాళం భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
