నవీన్ పోలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
లండన్ లో నివసించే టాప్ చెఫ్ అన్విత (అనుష్క)కు పెళ్లి అంటే సరైన అభిప్రాయం లేదు. భర్త నుండి విడిపోయిన తన తల్లితో పాటు కలిసి ఉంటుంది. అయితే తన తల్లి చనిపోయాక తోడు కోసం ఒక బిడ్డను కనాలని అనుకుంటుంది. కానీ దానికి పెళ్లి కాకుండా స్పెర్మ్ డొనేషన్ పద్దతిని ఫాలో అవ్వాలని భావిస్తుంది. ఇందుకోసం సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) అనే స్టాండప్ కమెడియన్ ను ఎంచుకుంటుంది.
అన్విత ప్రపోజల్ కు మొదట ససేమీరా అనే సిద్ధును ఫైనల్ గా ఒప్పించగలిగిందా లేదా? తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగింది?
నటీనటులు:
సిట్యుయేషనల్ కామెడీని మాస్టర్ చేయడంలో నవీన్ పోలిశెట్టి ఆరితేరిపోయాడు. స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి సరిగ్గా సరిపోయాడు. తన యాంటిక్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా కుదిరాయి. బోల్డ్ ఎన్నారైగా అనుష్క ఈ చిత్రంలో నటించింది. అనుష్క తన రోల్ ను చాలా సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోయింది.
మురళి శర్మ, జయసుధ, నాజర్, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
సాంకేతిక నిపుణులు:
కథ పరంగా కొత్త పాయింట్ ను ఎంచుకున్నాడు దర్శకుడు మహేష్ బాబు. అయితే నరేషన్ మాత్రం ఫ్లాట్ గా ఉంది. కొన్ని కామెడీ, ఎమోషనల్ సీన్స్ ను చక్కగా హ్యాండిల్ చేసాడు. ఓవరాల్ గా మహేష్ వర్క్ ఓకే. ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. రధన్ అందించిన సంగీతం కానీ గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎఫెక్టివ్ గా లేవు. సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు సూపర్.
ప్లస్ పాయింట్స్:
- నవీన్ పోలిశెట్టి పెర్ఫార్మన్స్
- సిట్యుయేషనల్ కామెడీ
మైనస్ పాయింట్స్:
- సంగీతం
- సినిమా యొక్క పేస్
చివరిగా:
అటు స్టాండప్ కామెడీ కానీ ఇటు స్పెర్మ్ డొనేషన్ కానీ మనవైపు అంతగా పాపులర్ కాలేదు. ఈ రెండు పాయింట్స్ తో సినిమా చేయడం కొత్తదనాన్ని ఇచ్చింది. అయితే నరేషన్ కొన్ని చోట్ల ఫ్లాట్ గా మారింది. సిట్యుయేషనల్ కామెడీ పరంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మెప్పిస్తుంది. ఓవరాల్ గా పేస్ ఇంకా మ్యూజిక్ వీక్ గా ఉన్న ఈ చిత్రాన్ని మీకు ఈ వీకెండ్ బోర్ కొడితే ఓ లుక్కేయొచ్చు.
తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5