ఇంగ్లాండ్ తో భారత్ ఆడాల్సిన 5వ టెస్టు మ్యాచ్ రద్దు అవ్వడంపై సీనియర్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఈ విషయమై సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. కేవల ఐపీఎల్ కోసమే బీసీసీఐ వారు ఈ మ్యాచ్ ను రద్దు చేశారు అంటూ చాలా మంది అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటి వరకు బీసీసీఐ నుండి ఎలాంటి స్పందన రాకున్నా కూడా నిజం మాత్రమే అదే అని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ టీమ్ ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం కోసమే 5వ టెస్టును ఆడలేదు. 5వ టెస్టు సందర్బంగా కరోనా బారిన పడితే ఐపీఎల్ లో ఆడలేము.. ఒక వేళ కరోనా బారిన పడితే డబ్బులు నష్టం అనే ఉద్దేశ్యంతోనే ఐపీఎల్ ను ఆడకుండా అటు వెళ్లారు అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ కోసం 5వ టెస్టు మ్యాచ్ ను క్యాన్సిల్ చేసినా కూడా వచ్చే ఏడాదిలో ఈ 5వ టెస్టు ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.