Switch to English

44 ఏళ్ళ ‘మెగా’ చిరం‘జీవితం’.! వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.!

91,318FansLike
57,015FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ అభిమానులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ పేరు గురించి.! చిరంజీవి ఓ వ్యక్తి కాదు, శక్తి. చిరంజీవి కేవలం కథానాయకుడే కాదు, అసలు సిసలు నాయకుడు కూడా.! తనను మెగాస్టార్‌ని చేసిన ప్రజల కోసం ఏమైనా చేయాలనుకున్నారు, రాజకీయాల్లోకొచ్చారు. అయితే, రాజకీయాల్లో వుంటేనే సేవ చేయగలమా.? రాజకీయాల్లో లేకున్నా సేవ చేయగలమనుకున్నారాయన.

ఔను, రాజకీయాల్లో వుంటే కొందరివాడు.. రాజకీయాల్లో లేకపోతే అందరివాడు.! ఆ ఆలోచనతోనే, రాజకీయం నేర్పిన గుణపాఠంతోనే, రాజకీయాల్ని వద్దనుకున్నారు చిరంజీవి, సినిమాల్లో కొనసాగుతూ, సమాజానికి తాను చెయ్యాలనుకున్నది చెయ్యగలుగుతున్నారు.. ఇప్పడాయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు, రావు.!

మెగాస్టార్ చిరంజీవి, సినీ రంగంలోకి ప్రవేశించాక చేసిన తొలి సినిమా ‘పునాది రాళ్ళు’. అయితే, అది కాస్త ఆలస్యంగా విడుదలైంది. మొదటగా విడుదలైన సినిమా ‘ప్రాణం ఖరీదు’. ఆ సినిమా సరిగ్గా ఇదే రోజున.. అంటే, సెప్టెంబర్ 22న 1978వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే, చిరంజీవి తొలి సినిమా విడుదలై నేటికి 44 ఏళ్ళన్నమాట.

ఈ నలభై నాలుగేళ్ళ సినీ జీవితంలో చిరంజీవి ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు. ఒకటీ అరా ఫెయిల్యూర్స్ కూడా చూసినా, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. చిరంజీవి మాట్లాడిందే డైలాగ్.. చిరంజీవి ధరించిందే స్టైలిష్ కాస్ట్యూమ్.. చిరంజీవి వేసిందే డాన్స్.. తెలుగు సినిమా గతిని మార్చేశారు చిరంజీవి అనడం అతిశయోక్తి కాదేమో.

సౌతిండియాలోనే కాదు, భారతదేశంలోనే ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సినీ హీరోగా చిరంజీవి రికార్డులకెక్కారు. ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి..’ అన్న మాట బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారంటే, అదీ చిరంజీవి గొప్పతనం. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా.. ఇలా ఎన్నెన్నో బాధ్యతలు నిర్వహించినా, ‘అన్నయ్య’ చిరంజీవి అన్న పిలుపు ముందుగా, మెగాస్టార్ చిరంజీవి అన్న పిలుపు కూడా చిన్నదేనని అంటుంటారు చిరంజీవి.

దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.! తెలుగు తెరకు రిస్కీ స్టంట్లు, రబ్బరు బొమ్మలా మెలితిరిగే డాన్సులు.. వీటిని పరిచయం చేసిందీ, వాటిని పాపులర్ చేసిందీ చిరంజీవే. తనదైన వెటకారాన్ని హాస్యానికి అద్ది, తనదైన స్టైల్‌ని సినిమాకి తీసుకొచ్చి చిరంజీవి.. సినీ రంగంలో ఎందరికో స్ఫూర్తి.!

చిరంజీవి ఇంకో 44 ఏళ్ళు సినీ ప్రపంచంలో మకుటం లేని మహారాజులా వెలుగొందాలని “తెలుగు బులెటిన్” మనస్ఫూర్తిగా కోరుకుంటుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...

ఎక్కువ చదివినవి

కాపు సంక్షేమ భవనానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

కాపు సామాజికవర్గ సంక్షేమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో ‘శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ భవనం’ కోసం రెండు ఎకరాల స్థలం...

ఆ ఉద్యోగులపై రైల్వే శాఖ కొరడా..! 16 నెలల్లో ఎంతమందిని తొలగించారంటే..

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల ప్రకారం పనితీరు సరిగాలేని రైల్వే ఉద్యోగులపై ఆ శాఖ కొరడా ఝులిపిస్తోంది. 2021 జూలై నుంచి ఇప్పటివరకూ ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై...

తిట్టుడేల.? తిట్టించుకోవడమేల జగన్ సారూ.!

రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ ఖచ్చితంగా వుంటుంది. ‘తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా..’ అనే నానుడి వుండనే వుందాయె.! నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

రాశి ఫలాలు: శనివారం 26 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ తదియ రా.10:49 వరకు తదుపరి చవితి సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం) నక్షత్రము: మూల రా.6:42 వరకు...

‘జడ్జిల బదిలీ వెనక్కు తీసుకోవాలి..’ ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం వివిధ హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో తెలంగాణ హైకోర్టు...