Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చెల్లెలి సెంటిమెంట్ తో చిరంజీవి మెగా హిట్ ‘అల్లుడా.. మాజాకా!’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

చిరంజీవి సినిమా అంటే ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వారిని కూడా అలరిస్తుంది అనేది తెలుగు సినిమా పరిశ్రమ మాట. చిరంజీవి ఎంటర్ టైన్మెంట్ హీరో అనేది దర్శక, నిర్మాతల మాట. చిరంజీవి ఆయన కెరీర్లో చేసిన సినిమాలే ఇందుకు నిదర్శనం. యువత, చిన్నారులు, మహిళలు, కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా అన్ని రకాల ఎలిమెంట్స్ జోడించి సినిమాలు చేయడమే చిరంజీవిని మెగాస్టార్ ను చేశాయి. ఈక్రమంలో తన మాస్ ఇమేజ్ కు ఫ్యామిలీ డ్రామా జోడించి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. ఆకోవకు చెందిన సినిమానే ‘అల్లుడా.. మాజాకా..!’. సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. చిరంజీవి మార్క్ మాస్, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చెల్లెలి సెంటిమెంట్ తో చిరంజీవి మెగా హిట్ ‘అల్లుడా.. మాజాకా!’

సినిమాలో భారీతనం..

గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ, చెల్లెలి సెంటిమెంట్, గడుసరి అత్తకు బుద్ది చెప్పే అల్లుడిగా సీతారాముడి పాత్రలో చిరంజీవి నటించారు. చెల్లెలిపై పడ్డ అపనిందను అబద్ధమని రుజువు చేసే క్రమంలో చిరంజీవి నటన, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని అలరించాయి. శ్రీరాముడి భక్తుడిగా సినిమాలో చిరంజీవి కనిపిస్తారు. సినిమా ప్రారంభంలో వచ్చే ‘మా ఊరి దేవుడు..’ పాట తెలుగు లోగిళ్లలో మార్మోగింది. ఇప్పటికీ శ్రీరామనవమి పందిళ్లలో ఈ పాట వినిపించడం గమనార్హం. చిరంజీవి రేంజ్ కు తగ్గట్టు ఫస్ట్ ఫైట్ భారీ ఖర్చుతో చిత్రీకరించారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ మరింత రిచ్ గా తెరకెక్కించారు. హెలికాఫ్టర్ నిచ్చెనకు వేలాడుతూ డూప్ లేకుండా చిరంజీవి చేసిన ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. హీరోయిన్లు రమ్యకృష్ణ, రంభ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. కోటి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో అప్పట్లో తొలి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ అందుకున్న సినిమాగా నిలిచింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చెల్లెలి సెంటిమెంట్ తో చిరంజీవి మెగా హిట్ ‘అల్లుడా.. మాజాకా!’

ప్రభుత్వం నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం..

చిరంజీవితోనే సినిమాలు నిర్మిస్తాను అని ప్రకటించిన కె.దేవీవరప్రసాద్ తమ దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీగా నిర్మించారు. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు చిరంజీవితో ఇదే తొలి సినిమా. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన సినిమా కలెక్షన్ల కనకవర్షం కురిపించింది. అయితే.. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైందనే విమర్శలు రావడంతో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇస్తామని, ప్రదర్శన నిలిపివేస్తామని ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన మెగా ఫ్యాన్స్ రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా హైదరాబాద్ తరలివెళ్లి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. తమ ఊళ్లలో టెంట్ వేసి నిరాహారదీక్షలు చేపట్టడం సంచలనమైంది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. 27 సెంటర్లలో 100 రోజులు రన్, షిఫ్టులతో మరో 20 సెంటర్లలో ఆడింది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...